ETV Bharat / international

చిన్న పిల్లలకు కరోనా టీకా ఎప్పుడు?

కరోనా టీకా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఇప్పటికీ వ్యాక్సిన్​ ప్రయోగాలు 18-65 ఏళ్ల మధ్య వయసు వారిపైనే జరుగుతున్నాయి. మరి.. చిన్నపిల్లలకు టీకా ఎప్పుడు అందిస్తారు?

author img

By

Published : Mar 4, 2021, 5:00 PM IST

కొవిడ్​ మహమ్మారికి విరుగుడు అయిన వ్యాక్సిన్​.. అనేక దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. భారత్​లోనూ రెండు టీకాలకు అనుమతి లభించిన తర్వాత.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇందులో తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, రెండో దశలో వృద్ధులు, 45- 60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇస్తున్నారు.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్ 2.0: నమోదు ఎలా? టీకా కేంద్రం ఎక్కడ?

మరి చిన్నపిల్లలకు వ్యాక్సిన్​ ఎప్పుడు అందుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం.. వీరిపై ఇంకా క్లినికల్​ ట్రయల్స్​ జరపకపోవడం. అయితే.. అందుకు ఎంతో సమయం లేదంటున్నారు పరిశోధకులు.

విదేశాల్లో అనుమతులు పొందిన ఫైజర్​ వ్యాక్సిన్​ 16 ఏళ్లకు పైబడిన వారికే వినియోగించాల్సి ఉంటుంది. అయితే.. ఆయా దేశాల్లో వీరిని అర్హులుగా ప్రకటిస్తే ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో కొందరు వ్యాక్సిన్​ పొందనున్నారు.

మరోవైపు మోడెర్నా టీకాను.. 18 అంతకంటే ఎక్కువ వయస్కుల్లో వినియోగించేందుకు అనుమతి ఉంది.

టీనేజర్లలో..

12 ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగాలను ఫైజర్​, మోడెర్నా ఇప్పటికే ప్రారంభించాయి. వీటి ఫలితాలను వేసవిలో విడుదల చేసే అవకాశముంది. వీటి సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం.. ఔషధ నియంత్రణ సంస్థల అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు గ్రీన్​సిగ్నల్​ ఇస్తే.. ఈ టీనేజర్లకూ టీకా అందనుంది.

అయితే.. 12 ఏళ్ల కంటే తక్కువ వయస్కులపై ప్రయోగాలు జరపడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావిస్తున్నారు పరిశోధకులు. వీరిలో టీకా భిన్నమైన ప్రతిస్పందనలు చూపించే అవకాశం ఉందని మేరీలాండ్​ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

పిల్లల్లో రోగనిరోధకతను పెంచేందుకు వారికీ టీకా ఇవ్వాలనుకుంటున్నట్లు అమెరికాలోని డెక్సెల్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ డా. సారా లాంగ్​ చెబుతున్నారు. కరోనా వైరస్​ వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురికావడం, మరణించడం వంటి సంఘటనలు తక్కువే అయినప్పటికీ.. వారి నుంచి వైరస్​ ఇతరులకు వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు.

ఈ ఏడాది చివర్లో.. వీరిపై అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం!

శశికళ గుడ్​బై​: లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.