ETV Bharat / international

భయపెడుతున్న కరోనా వేరియంట్లు.. ఎలా జాగ్రత్తపడాలి? - DELTA MEANING

కరోనాలో రోజురోజుకూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. అన్నింటిలోకెల్లా కొంత కాలంగా డెల్టా వేరియంట్​ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో కొవిడ్​ శాంతించిందనుకున్నా.. మళ్లీ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దీనికి కారణం డెల్టానే. ఈ జులై చివరినాటికి అమెరికాలో ఉన్న కరోనా కేసుల్లో.. 93 శాతానికి పైగా డెల్టా రకానివే అంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ కొత్తగా ఉద్భవిస్తున్న కరోనా రకాలను అడ్డుకోలేమా? సార్స్​-కోవ్​-2 వైరస్​ వేరియంట్ల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?

What are COVID-19 variants
కొవిడ్​ వేరియంట్లు అంటే ఏంటి?
author img

By

Published : Aug 12, 2021, 11:37 AM IST

ఇటీవలి కాలంలో.. ఆల్ఫా, బీటా, డెల్టా, కప్పా.. అని ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి. ఇవన్నీ కరోనా వేరియంట్లు. అంటే.. సాధారణ కరోనా నుంచి పుట్టుకొచ్చిన కొత్త రకాలు. వీటినే స్ట్రెయిన్లు అని కూడా అంటారు. వీటిల్లో ఎక్కువగా డెల్టా ప్రమాదకరంగా పరిణమించింది. మరి.. కరోనా వేరియంట్లు అంటే ఏంటి? వాటితో ప్రమాదం ఎంత? వ్యాక్సిన్లు వీటిపై ఎలా పనిచేస్తున్నాయి? వీటి బారినపడకుండా ఎలా రక్షించుకోవాలి? ఇవి సోకితే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఈ కరోనా వేరియంట్లపై సామాన్య ప్రజల్లో తలెత్తే కొన్ని సందేహాలకు సమాధానమిచ్చారు మోర్​హౌస్​ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన ప్రముఖ శిశువైద్యుడు, అంటువ్యాధుల నిపుణులు డా. లిల్లీ చెంగ్​. వీటి బారిన పడకుండా ఉండేందుకు మనమేం చేయాలో కూడా వివరించారు.

1. వేరియంట్లు అంటే ఏంటి? ఎలా బయటపడతాయి?

వైరస్​లు వాతావరణానికి అనుగుణంగా.. తమ మనుగడ కోసం కాలక్రమేణా పరివర్తన చెందుతుంటాయి. కొవిడ్​-19కు కారణమయ్యే.. సార్స్​-కోవ్​-2 వైరస్​.. కూడా అదే విధంగా పరివర్తన చెందుతోంది.

ఈ కరోనా కొత్త రకాలనే స్ట్రెయిన్లు/ వేరియంట్లు అంటారు. అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ).. ఈ వేరియంట్లను 3 రకాలుగా వర్గీకరించింది. అవేంటంటే..

వేరియంట్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​(వీఓఐ)

వ్యాధి సంక్రమణను అడ్డుకొనే రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.

ఈటా, ఐఓటీఏ, కప్పా ఈ రకానికి చెందినవే.

వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​(వీఓసీ)

దీని బారినపడితే.. చికిత్సకు తక్కువగా ప్రతిస్పందిస్తారు. రోగ నిర్ధరణ కష్టమే. వ్యాక్సిన్ల బారి నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది. ఇవి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి/ అంటుకుంటాయి. మరిన్ని తీవ్ర అంటురోగాలకు దారితీస్తాయి.

ఆల్ఫా, డెల్టాలు ఈ ఆందోళనకరమైన రకం కిందికే వస్తాయి.

వేరియంట్​ ఆఫ్​ హై కాన్సీక్వెన్స్​(వీఓహెచ్​సీ)

ఇది అన్నింటికన్నా ప్రమాదకరం. రోగనిర్ధరణ, నివారణ, చికిత్స అన్నీ కష్టమే. ఇది తీవ్ర అంటురోగాలకు కారణం అవుతుంది. ఆస్పత్రిలో చేరే అవకాశమూ ఎక్కువే. అయితే.. ఇప్పటివరకు వీఓహెచ్​సీ ఆనవాళ్లు కనిపించలేదు.

What are COVID-19 variants
ఆస్పత్రుల్లో కరోనా బాధితులు

2. వేరియంట్లు ఎల్లప్పుడూ ప్రమాదకరమా?

వేరియంట్లు.. వాటి ఉత్పరివర్తనం, జన్యుక్రమాన్ని బట్టి ఇతర రకాలతో పోలిస్తే ఎక్కువ ప్రమాదమా? తక్కువనా? అనేది ఆధారపడి ఉంటుంది. వ్యాధి సంక్రమణ, రోగ నిరోధక వ్యవస్థపై దాని ప్రభావం, వ్యాధి లక్షణాల తీవ్రత.. మ్యుటేషన్లను బట్టి మారుతుంటుంది.

What are COVID-19 variants
మాస్కు ధరించడం మర్చిపోవద్దు

ఆల్ఫా..

ఉదాహరణకు ఆల్ఫా వేరియంట్​.. కరోనా సాధారణ రకం సార్స్​-కోవ్​-2 కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది 43 నుంచి 90 శాతంగా ఉంది. ఆల్ఫా రకం.. తీవ్ర రోగాలకు దారితీయొచ్చు.

డెల్టా..

డెల్టా వేరియంట్​ ఆల్ఫా కంటే ప్రమాదకరం. మొదట్లో వచ్చిన కొవిడ్​ స్ట్రెయిన్ల కంటే రెట్టింపు వేగంతో ఇది మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాక్సిన్లు వేసుకోనివారు డెల్టా బారినపడే అవకాశాలెక్కువ. వీరికి సోకితే.. అది తీవ్ర రోగాలకు కారణం అవ్వొచ్చు.

What are COVID-19 variants
వ్యాక్సినే కరోనా నుంచి శ్రీరామరక్ష

డెల్టా వేరియంట్​ కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, మనిషి శరీరంలో చాలా త్వరగా వృద్ధి చెందుతోందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ వేరియంట్​ కారణంగా 2019-2020లో వచ్చిన కొవిడ్‌ వైరస్‌ కంటే 1000 రెట్లు ఎక్కువగా మనిషి శరీరంలో ఇప్పుడు వైరల్‌ లోడ్‌ కనిపిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

మరో ఆందోళనకర విషయం ఏంటంటే.. ఇది వ్యాక్సిన్​ వేసుకున్న/వేసుకోని వారిలో ఒకే రకంగా ఉండటం గమనార్హం.

3. అమెరికాలో ఏ వేరియంట్లు ఉన్నాయి?

అమెరికాలో కొద్దినెలలుగా డెల్టా వేరియంట్​ ఆందోళన కలిగిస్తోంది. సీడీసీ గణాంకాల ప్రకారం.. జులై చివరినాటికి అగ్రరాజ్యంలో నమోదైన కేసుల్లో 93 శాతానికిపైగా డెల్టా వేరియంట్​వే. 3 శాతం ఆల్ఫా రకానివి అని తెలిసింది.

రానున్న రోజుల్లో డెల్టా ప్లస్​ సహా ఇతర కొత్త స్ట్రెయిన్లు అమెరికాలో విజృంభించే అవకాశాలున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

4. వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయి?

అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన 3 కరోనా వ్యాక్సిన్లు.. కొవిడ్​-19పై ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు పరిశోధకులు కృషిచేస్తున్నారు. అయితే.. కొన్ని అధ్యయనాలు మాత్రం.. ఈ టీకాలు కొవిడ్​-19 సంబంధిత కేసులు, మరణాలను తగ్గిస్తున్నట్లు పేర్కొంటున్నాయి.

వివిధ వ్యాధుల నివారణకు అందించే టీకాల్లో ఏది కూడా 100 శాతం ప్రభావవంతంగా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. బ్రేక్​ త్రూ ఇన్ఫెక్షన్స్​ ఉండే అవకాశముందని చెబుతున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన 14 రోజుల తర్వాత కరోనా సోకితే దీనిని బ్రేక్​ త్రూ ఇన్​ఫెక్షన్​గా అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ నిర్ధరించింది.

ఇదీ చూడండి: టీకా తీసుకున్నా మళ్లీ కరోనా.. ఎందుకిలా?

అయితే.. రెండు డోసుల టీకా వేసుకున్నవారిలో కొవిడ్​-19 స్వల్ప లక్షణాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు.. రెండు డోసుల ఫైజర్​ బయోఎన్​టెక్​ టీకా.. ఆల్ఫాపై 93.7 శాతం సమర్థంగా పనిచేస్తుందని, డెల్టాను 88 శాతం అడ్డుకోగలదని ఇంగ్లాండ్​లో పలు అధ్యయనాలు నిరూపించాయి.

5. ఎలా జాగ్రత్తగా ఉండాలి?

మరి కొవిడ్​-19లో ఇన్ని వేరియంట్లు ఉద్భవిస్తున్న నేపథ్యంలో.. మనం సురక్షితంగా ఉన్నామో లేదో ఎలా తెలుసుకోవాలి. లేకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది రెండింటిపై ఆధారపడి ఉంటుంది.

ఒకటి- టీకా వేసుకోవడం.

మనం వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నట్లయితే దాదాపు సురక్షితంగా ఉన్నట్లే. అమెరికాలో కొద్దినెలలుగా సంభవించిన కొవిడ్​-19 మరణాల్లో 99.5 శాతం టీకా వేసుకోనివారే.

కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని సీడీసీ మార్గదర్శకాలు జారీ చేసింది.

వ్యాక్సిన్​ వేసుకున్నా/వేసుకోకున్నా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

టీకా తీసుకోనట్లయితే.. రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని పేర్కొంది.

ఇదీ చూడండి: Corona Reinfection: 26 ఏళ్ల డాక్టర్​కు 13 నెలల్లో 3 సార్లు కరోనా

రెండోది- సామాజిక వ్యాప్తి

సాధారణంగా వైరస్ వచ్చిన ఒక వ్యక్తికి, మరో కరోనా పాజిటివ్‌తోగానీ, కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశం నుంచి వచ్చినవారితోగానీ ఉన్న కాంటాక్ట్స్ గురించి తెలుసుకోలేని స్థితిలో దానిని కమ్యూనిటీ వ్యాప్తి అంటారు. అంటే, వైరస్ సమాజంలో స్వేచ్ఛగా వ్యాపిస్తుంటుంది. దీనిని నియంత్రించాలి. వ్యాక్సినేషన్​ వేగాన్ని పెంచాలి.

What are COVID-19 variants
సామాజిక వ్యాప్తికి అడ్డుకట్ట ఎలా?

వ్యాక్సినేషన్​ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో కంటే.. తక్కువ వ్యాక్సినేషన్​ నమోదైన ప్రాంతాల్లో వ్యాక్సిన్​ వేసుకోనివారి నుంచి టీకా తీసుకున్నవారికీ వైరస్​ సోకే అవకాశాలెక్కువ.

ఇదీ చూడండి: Covid: '12 వారాలైనా పట్టు వదలని కరోనా​'

చిన్నారులకు ప్రమాదం..

ఇప్పటివరకు టీకా అందని చిన్నారులపై.. కొవిడ్​-19 తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 12-15 మధ్య వయస్కుల్లో 29.1 శాతం, 16-17 ఏళ్ల వారు 404 శాతం మందే రెండు డోసుల టీకా పొందారు. మిగతావారు ప్రమాదంలో ఉన్నట్లే.

What are COVID-19 variants
చిన్నపిల్లలకు వ్యాక్సిన్​
  • అమెరికాలోని మొత్తం కరోనా కేసుల్లో దాదాపు 43 లక్షల మంది చిన్నారులే. ఇది దేశం మొత్తం నమోదైన కేసుల్లో 14.3 శాతం.
  • మీ పిల్లలు టీకా వేయించుకోకపోతే.. వారిని రక్షించే ఉత్తమ మార్గం.. మీ ఇంట్లోని మిగతావారంతా వ్యాక్సిన్​ వేసుకోవడమే.
  • బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.
    What are COVID-19 variants
    మాస్కు ధరించడం మర్చిపోవద్దు
  • ఏ కరోనా రకాన్నైనా ఎదుర్కోవడానికి.. వ్యాక్సిన్​ వేసుకోవడం ఉత్తమం.
  • మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, జనసమూహాల్లో తిరగకపోవడం మంచిది.
    What are COVID-19 variants
    సామాజిక దూరం పాటించాలి.
  • బ్రేక్​త్రూ ఇన్ఫెక్షన్​ నుంచి రక్షణ కోసం.. బహుళ పొరల మాస్కు ధరించడం మంచిది.

ఇవీ చూడండి:

వ్యాక్సిన్​ వేసుకున్న, వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే..!

Vaccination: 'అందరికీ టీకా వేస్తే ఉద్ధృతులకు బ్రేక్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.