ETV Bharat / international

ఆమె వల్ల ట్రంప్​ బ్యాంక్ ఖాతా వివరాలు లీక్! - Trump's private bank account

అమెరికా అధ్యక్షుడు అంటే భారీ భద్రత ఉంటుంది. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. వ్యక్తిగత విషయాలు, బ్యాంకు ఖాతాల వివరాలు వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లడించారు. అలాంటిది శ్వేతసౌధంలోని ఓ అధికారి పొరపాటున అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేశారు. ఈ అంశంపై ఆమెతోపాటు ట్రంప్​పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Trump's bank details
ట్రంప్​ బ్యాంకు ఖాతా వివరాలు బహిర్గతం!
author img

By

Published : May 23, 2020, 4:43 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను పొరపాటున బహిర్గతం చేశారు శ్వేతసౌధం మీడియా​ కార్యదర్శి కైలీ మెక్​ఎనాని. ఆ దేశ ఆరోగ్య, ప్రజా సేవల విభాగం (హెచ్​హెచ్​ఎస్​)కు ట్రంప్​ అందించిన చెక్కు​ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

గత బుధవారం (మే 20న) జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్​ ఖాతా వివరాలు వెల్లడించారు మెక్​ఎనాని. కరోనా వైరస్​ కట్టడి, నివారణ, కేసుల నిర్ధరణ వంటి చర్యలకు సాయంగా హెచ్​హెచ్​ఎస్​ విభాగానికి అధ్యక్షుడు ట్రంప్​ తన వ్యక్తిగత ఆదాయంలో నుంచి ఒక లక్ష డాలర్లు విరాళం ఇస్తున్నారంటూ ఓ చెక్కును ప్రదర్శించారు. తద్వారా ట్రంప్ వ్యక్తిగత ఖాతా వివరాలు బహిర్గతం అయ్యాయని పేర్కొంటూ డైలీ మెయిల్ పత్రిక కథనం ప్రచురించింది.

ట్రంప్​ ఖాతా వివరాల బహిర్గతంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో శ్వేతసౌధం అధికార ప్రతినిధి జుడ్​ డీర్​ ఓ ప్రకటన విడుదల చేశారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు అధునాతన థెరపీలకు సాయం చేసేందుకు అధ్యక్షుడి జీతం వెళుతోందన్నారు. చెక్కు నిజమైనదా కాదా అనే దానిపై కాకుండా నిఖార్సయిన వార్తల్ని ప్రజలకు అందించడంపై మీడియా దృష్టి పెట్టాలని హితవు పలికారు.

సామాజిక మాధ్యమాల్లో..

అయితే.. జుడ్ డీర్​ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో ట్రంప్​, మెక్​ఎనానిపై వ్యంగ్యాస్త్రాలను ఆపలేకపోయింది. "అధ్యక్షుడి చెక్కు విషయంలో తప్పటడుగు వేసిన మెక్​ఎనాని ప్రముఖ హార్వర్డ్​ లా స్కూల్​ నుంచి ఎలా పట్టా పొందారు?" అని ప్రశ్నించారు ఓ నెటిజన్​.

మరో నెటిజన్​ ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని.. ట్రంప్​ తాను చెప్పుకున్నంత ధనవంతుడు కాదని పేర్కొన్నాడు. లక్ష డాలర్ల సాయంతో.. ట్రంప్​ ఖాతా ఓవర్​డ్రా అయిఉండొచ్చని ఎద్దేవా చేశాడు.

ప్రస్తుతం అధ్యక్షుడి మొత్తం ఆదాయం ఎంత అనేది తెలియదు. మార్చిలో ఫోర్బ్స్​ సుమారు 3.1 బిలియన్​ డాలర్లుగా అంచనా వేసింది.

హ్యాంకింగ్​కు అవకాశం లేదు..

అధ్యక్షుడు ట్రంప్​ తన హోదా కారణంగా ఆయన ఖాతాకు అదనపు భద్రతా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు కాలిఫోర్నియాకు చెందిన ఐడెంటిటీ తెఫ్ట్​​ రిసోర్స్​ సెంటర్​ అధ్యక్షులు వెలాస్వ్కెజ్​. మెక్​ఎనాని చెక్​ వివరాలు వెల్లడించినా ఆయన ఖాతా హ్యాంకింగ్​కు గురయ్యే అవకాశాలు లేవన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.