ETV Bharat / international

చైనాతో వివాదంలో భారత్​ వైపే ఉంటాం: అమెరికా

author img

By

Published : Jul 7, 2020, 6:21 AM IST

చైనాతో విభేదాలకు సంబంధించి భారత్​కే మద్దతిస్తామని అమెరికా సంకేతం ఇచ్చింది. భారత్​- చైనా లేదా మరెక్కడైనా కానీ ఘర్షణ చెలరేగితే దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. చైనా సహా మరే ఇతర దేశమైన దూకుడుగా ప్రవర్తిస్తే సమ్మతించబోమని తేల్చిచెప్పింది.

us china india
అమెరికా

భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో తమ సైన్యం భారత్‌కు బాసటగా ఉంటుందన్న సంకేతాన్ని అమెరికా ఇచ్చింది. పసిఫిక్‌లో కానీ మరెక్కడైనా కానీ ప్రబల శక్తిగా తనకున్న హోదాను వదులుకోబోనని విస్పష్టంగా చైనాకు తేల్చి చెప్పింది. ‘

"భారత్‌-చైనా మధ్య కానీ మరెక్కడైనా కానీ ఘర్షణ చెలరేగిన సందర్భాల్లో అమెరికా సైన్యం ‘దృఢంగా’ వ్యవహరిస్తుంది. చైనా లేదా మరే ఇతర దేశమైనా అత్యంత ప్రబల శక్తిగా దూకుడు ప్రదర్శించడాన్ని మేం సమ్మతించబోం. అలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోం"

- మార్క్​ మెడోస్, వైట్​హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్

చైనా అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేస్తారని మార్క్ చెప్పారు. విదేశాల్లోని అమెరికా ఉత్పాదన సామర్థ్యాలను స్వదేశానికి రప్పించే అంశాలను అందులో ప్రస్తావిస్తారని తెలిపారు. భారత్‌-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళంలో రెండు విమాన వాహక నౌకలను మోహరించింది. "మా వద్ద ప్రబల పోరాట సామర్థ్యం ఉందని ప్రపంచానికి తెలియజేయడమే దీని ఉద్దేశం" అని మార్క్‌ స్పష్టం చేశారు.

దక్షిణ చైనా సముద్రంలో అనేక దేశాలతో చైనాకు సముద్ర సరిహద్దు వివాదం కొనసాగుతోంది. భారత్‌, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన సమసిపోతున్నట్లు సంకేతాలు వెలువడినప్పటికీ మార్క్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీన్ని బట్టి డ్రాగన్‌ విషయంలో కఠిన వైఖరి కొనసాగుతుందన్న సంకేతాన్ని అమెరికా ఇచ్చినట్లయింది.

ఇదీ చూడండి: డోభాల్​ చాకచక్యంతోనే చైనా వెనక్కు తగ్గిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.