ETV Bharat / international

'యుద్ధభూమి'పై అమెరికా 8 ట్రిలియన్ డాలర్ల ఖర్చు! - అమెరికా అఫ్గానిస్థాన్​

ఉగ్రవాదుల ఏరివేతకు 20ఏళ్లుగా అమెరికా భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. ఎంతంటే.. భారత జీడీపీలో మూడింతలకు సమానమైన సొమ్ములను కేవలం యుద్ధభూముల్లో (US cost of war on terror )ఖర్చుపెడుతోందని ఓ నివేదిక వెల్లడించింది. ఇది బైడెన్​ అంచనాలకు మించిన ఖర్చని పేర్కొంది. వాస్తవానికి క్షేత్రస్థాయి పరిస్థితుల్లో అనేక విషయాల్లో పారదర్శకత లోపించిందని.. అందువల్ల అమెరికా చేస్తున్న ఖర్చులపై సరైన స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.

War on terror to cost US a whopping $8 trillion
అమెరికా
author img

By

Published : Sep 3, 2021, 5:43 PM IST

9/11 దాడుల(9/11 attack) అనంతరం ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగిన అమెరికా.. అఫ్గానిస్థాన్​, పాకిస్థాన్​, సిరియా, ఇరాక్​, ఆఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు నిరాటంకంగా కార్యకలాపాలు సాగించింది. ఇందుకు అగ్రరాజ్యం భారీ మొత్తంలో ఖర్చుపెట్టాల్సి(US cost of war on terror) వచ్చింది. 20ఏళ్లల్లో 8 ట్రిలియన్​ డాలర్లు ఖర్చు అయినట్టు అంచనా. భారత దేశ జీడీపీకి ఇది మూడింతలు!

అఫ్గానిస్థాన్​​ నుంచి బలగాల ఉపసంహరణ(evacuation from afghanistan) ప్రక్రియ వేగవంతం చేసిన క్రమంలో 'అమెరికా ఇప్పటికే ట్రిలియన్​ డాలర్లు ఖర్చు పెట్టింది,' అని బైడెన్​ వ్యాఖ్యానించారు. వాస్తవానికి.. బైడెన్​ అంచనాలకు మించి ఖర్చు అయినట్టే కనిపిస్తోంది. అఫ్గాన్​తో పాటు ఇతర దేశాల్లో అమెరికా కార్యకలాపాలను లెక్కిస్తే ఇదే బయటపడుతుంది!

9/11 దాడుల అనంతరం అగ్రరాజ్యం చేపట్టిన కార్యకలాపాలపై బ్రౌన్​ విశ్వవిద్యాలయానికి చెందిన వాట్సన్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఇంటర్నేషనల్​ అండ్​ పబ్లిక్​ అఫైర్స్​ బృందం 'కాస్ట్స్​ ఆఫ్​ వార్​ ప్రాజెక్ట్​' పేరుతో అధ్యయనం చేపట్టింది. ఇందులో 50కిపైగా నిపుణులు, మానవహక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులున్నారు. ప్రజాస్వామ్య చర్చలు, ప్రజా విధానాల రూపకల్పనకు వీరు సాయం చేస్తుంటారు. అమెరికా, సహా యుద్ధభూమిలో అన్ని వర్గాల ప్రజలపై యుద్ధం ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై 2010 నుంచి ఈ ప్రాజెక్ట్​ విశ్లేషిస్తోంది. ఇందులో యుద్ధభూమిలో అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టిన ఖర్చులు, ఉగ్రవాద నిరోధక చర్యల కోసం అగ్రరాజ్య హోంశాఖ చేసిన ఖర్చులు, తీసుకున్న అప్పులు, వాటిపై వడ్డీలు ఈ ప్రాజెక్ట్​లో భాగంగా లెక్కిస్తారు. యుద్ధవిచ్ఛిన్న దేశాల్లో సేవలందిస్తున్న అమెరికా సైనికుల ఆరోగ్యానికయ్యే ఖర్చులు కూడా అమెరికానే భరిస్తుండటం వల్ల వాటిని కూడా ఇందులో జోడించారు. రానున్న రోజుల్లో ఈ ఖర్చు 2.2 బిలియన్​ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

"అమెరికా పరంగా గత 20ఏళ్లలో ఇరాక్​లో యుద్ధం.. అత్యంత ఉద్ధృతంగా సాగింది. 2008లో అక్కడ అత్యధికంగా ఖర్చు అయ్యింది. 2011లో అఫ్గానిస్థాన్​లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2021 ఆర్థిక సంవత్సరంలో పాక్​, అఫ్గానిస్థాన్​పై 1 ట్రిలియన్​ డాలర్ల ఖర్చు అవుతుందని హోంశాఖ అంచనా వేసింది. 2022 ఆర్థిక ఏడాది కోసం 8.9బిలియన్​ ఇవ్వాలని 2021 మే బడ్జెట్​లో అభ్యర్థించింది బైడెన్​ ప్రభుత్వం. 2021 వరకు ఇరాక్​, సిరియాపై 886బిలియన్​ డాలర్లు ఖర్చు చేసింది అగ్రరాజ్యం."

-- నివేదిక

ఈ 'ఓవర్సీస్​ కాంటిజెన్సీ ఆపరేషన్స్​'లో అఫ్గాన్​, పాకిస్థాన్​కే ఎక్కువ సమయం కేటాయించింది అగ్రరాజ్యం. అఫ్గాన్​లో 2015 వరకు 'ఆపరేషన్​ ఎండ్యూరింగ్​ ఫ్రీడం' పేరుతో, ఆ తర్వాత 'ఆపరేషన్​ ఫ్రీడం సెంటినెల్​' పేరుతో ఉగ్రఏరివేత చేపట్టింది. ఇరాక్​లో యుద్ధానికి "ఆపరేషన్​ న్యూ డాన్​" అని పేరుపెట్టింది. ఇరాక్​, సిరియాలోని ఐసిస్​పై పోరు కోసం "ఆపరేషన్​ ఇన్​హెరిటెంట్​ రిసోల్వ్​" అనే పేరిచ్చింది.

ఖర్చులపై సందేహాలు...!

ఆపరేషన్లలో అయిన ఖర్చులపై అధ్యయనకర్తలు సందేహాలు వ్యక్తం చేశారు. ఖర్చులపై స్పష్టత లేదని, వ్యయం మాత్రం పెరిగిపోతోందంటున్నారు.

"కార్యకలాపాల కోసం యుద్ధభూమిలో మోహరించిన సైనికుల సంఖ్యపై ఒక్కోసారి హోంశాఖ నుంచి సరైన స్పష్టత ఉండటం లేదు. అఫ్గాన్​, ఇరాక్​లో సైనికుల మోహరింపు లెక్కలను చెప్పడం 2017లో ఆపేసింది. 2020 ఫిబ్రవరి అనంతరం వైమానిక దాడులు, ఆయుధాల సామగ్రి వినియోగానికి సంబంధించిన వివరాలనూ చెప్పడం లేదు. దీని వల్ల అమెరికా పారదర్శకతపై అనుమానాలు రేకెతిస్తున్నాయి."

-- నివేదిక

2020లో ఈ వ్యవహారంపై సీఐజీఏఆర్​(స్పెషల్​ ఇన్​స్పెక్టర్​ జెనరల్​ ఫర్​ అఫ్గానిస్థాన్​ రీకన్​స్ట్రక్షన్​) అసహనం వ్యక్తం చేసింది. అఫ్గాన్​ పునరుద్ధరణ బాధ్యతలను అమెరికా తమకు అప్పగించిందని.. అయితే లోపాలు కనపడి, ప్రశ్నించే సరికి.. 'రహస్య సమాచారం బయటపెట్టలేమని' అధికారులు దాటవేస్తున్నట్టు ఆరోపించింది.

ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం తాము చేసిన అధ్యయనంలో బడ్జెట్​ను కూడా పేర్కొన్నామని, అయితే అందులో లెక్కలు పూర్తిస్థాయిలో వాస్తవమేనని చెప్పలేమని నివేదిక చెప్పడం గమనార్హం.

ఆగస్టు 14-31 మధ్య అఫ్గాన్​లో చేపట్టిన తరలింపు ప్రక్రియ కోసం అయిన ఖర్చు కూడా ఇందులో లేదు.

ఇదీ చూడండి:- అఫ్గాన్​ సంక్షోభం: వేల మరణాలు- ట్రిలియన్​ డాలర్ల ఖర్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.