ETV Bharat / international

కరోనాతో సహజీవనం: లాక్​డౌన్​ ఎత్తివేత దిశగా ప్రపంచం!

కరోనా వైరస్​ వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్​డౌన్​ నుంచి బయటపడేందుకు పలు దేశాలు ప్రణాళికలు రచించడం మొదలు పెట్టాయి. వైరస్​తో సహజీవనం చేస్తూనే కొన్ని ప్రత్యేక చర్యలతో.. అదుపు తప్పిన జీవితాలను, కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

virus-warnings-for-ramzan-as-some-pandemic-shutdowns-ease
కరోనాతో సహజీవనం- లాక్​డౌన్​ ఎత్తివేత వైపు అడుగులు
author img

By

Published : Apr 23, 2020, 4:38 PM IST

మనిషికి ఓ సమస్య వస్తే.. తొలుత భయపడిపోతాడు. ఆ తర్వాత ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఒక వేళ అది పరిష్కారం కాకపోతే సద్దుకుపోయో లేదంటే అలవాటుపడో.. ముందుకు సాగుతాడు. ఇప్పుడు కరోనా వైరస్​తోనూ ఇదే జరుగుతోంది. వైరస్​తో సహజీవనం చేస్తూనే లాక్​డౌన్​ ఎత్తివేసి సాధారణ జీవితంలో పడిపోవడానికి, కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపడేయడానికి పలు దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

వియత్నాం...

వియత్నాంలో గత మూడు రోజులుగా ఒక్క పాజిటివ్​ కేసు కూడా నమోదుకాలేదు. వైరస్​ విజృంభించిన తొలినాళ్లల్లో వెంటనే సరిహద్దులను మూసివేసింది వియత్నాం. బాధితుల గుర్తింపు చర్యలు ముమ్మరంగా చేపట్టింది. ఇప్పుడు అసలు కేసులే నమోదుకాకపోవడం వల్ల ఆంక్షల సడలింపువైపు అడుగులు వేస్తోంది.

న్యూజిలాండ్​లో...

న్యూజిలాండ్​లో గురువారం కేవలం మూడు కేసులే నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య సింగిల్​ డిజిట్​కు పడిపోవడం దేశ ప్రజలకు తీవ్ర ఉపశమనం కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ఇప్పటికీ అనేక నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గినందున వచ్చే నెలలో ఆంక్షలు సండలించాలని న్యూజిలాండ్​ ఆలోచిస్తోంది.

అమెరికా...

లాక్​డౌన్​ నుంచి తొందరగా బయటపడాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇప్పటికే కార్యచరణను ప్రకటించారు. కొన్ని రాష్ట్రలు వాటిని అమలు చేయడం మొదలుపెట్టాయి. అయితే లాక్​డౌన్​ విధించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న ట్రంప్​కు వాటిని ఎత్తివేయడం కూడా అంతే కష్టంగా ఉండనుంది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసులు, మరణాలు నమోదైన అగ్రరాజ్యంలో.. వైరస్​ నుంచి సురక్షితంగా ఉన్నారన్న ధైర్యం ప్రజల్లో నింపడం ట్రంప్​ ముందున్న అతిపెద్ద సవాలు.

చైనాలో...

చైనాలో కొత్త మరణాలు లేకపోవడం, 10 కొత్త కేసులను గుర్తించడం వల్ల అధికారుల్లో విశ్వాసం మరింత పెరిగింది. ఇప్పటికే అనేక వ్యాపారాలను పునరుద్ధరించిన చైనాకు ఇది మరింత ఊరటనిస్తోంది. పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు పాఠశాలలకు చేరుతున్నారు. దీన్ని బట్టి చైనావ్యాప్తంగా అతి త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటాయనడంలో సందేహం లేదు.

అయితే చైనాలో విదేశీ కేసుల సంఖ్య కొంత ఆందోళనకరంగా ఉంది. అందువల్ల విదేశీ పర్యటకుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. క్వారంటైన్​ నిబంధనలు కూడా కచ్చితంగా పాటిస్తున్నారు.

రంజాన్​ మాసం...

మరికొద్ది రోజుల్లో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే.. రంజాన్​ మాసం ప్రారంభం కానుంది. వేడుకలు, సుర్యాస్తమయం తర్వాత భారీ విందులు జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం.. ప్రపంచ దేశాల్లో లాక్​డౌన్​ అమల్లో ఉండటం వల్ల ముస్లింలు ఈ ఏడాది వీటన్నింటికీ దూరమవనున్నారు. అయితే కరోనా వైరస్​ ఓ శత్రువు అని.. దానిపై జరుగుతున్న పోరాటంపై దృష్టి సారించాలని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటేరస్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.