ETV Bharat / international

వెనెజువెలా జైలులో ఘర్షణ-23మంది ఖైదీల మృతి

వెనెజువెలా జైలులో చెలరేగిన అల్లర్లలో 23మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఖైదీల దుష్ప్రవర్తనే ఘటనకు దారితీసిందని అధికారులు ప్రకటించారు.

జైలులో ఘర్షణ-23మంది ఖైదీల మృతి
author img

By

Published : May 25, 2019, 6:43 AM IST

అధికారులు, ఖైదీల మధ్య ఘర్షణ వెనెజువెలాలో 23మంది ప్రాణాలు పోయేందుకు కారణమయింది. పోర్చుగీసా రాష్ట్రం లోని ఓ జైలులో బ్యారక్​లోకి అధికారులను ఖైదీలు అనుమతించకపోవడం ఈ ఘటనకు దారితీసింది. తమ వద్ద ఉన్న ఆయుధాలు, అనుమతి లేని వస్తువులను స్వాధీనం చేసుకుంటారన్న అనుమానంతో అధికారులను నిలువరించేందుకు ఖైదీలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోగా, 18మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.

జట్లుగా విడిపోయిన ఖైదీలు జైళ్లలో మాదక ద్రవ్యాలు, ఆయుధాలను సరఫరా చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.

"ఘటనకు కారణం బ్యారక్​లను అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చిన ఖైదీలదే"

-హంబర్టా ప్రాడో, వెనెజువెలా జైళ్ల అధికారి

"ఘటన జరిగిన బ్యారక్​ సామర్థ్యం 250 మంది మాత్రమే. కానీ 540 మందిని కుక్కారు. కిక్కిరిసి పోయిన జైలు బ్యారక్​లో ఖైదీలపై దాడి చేసి మట్టుబెట్టారని" ఖైదీల హక్కుల సంఘం ఆరోపించింది.

2017 నుంచి ఇప్పటివరకు వెనెజువెలాలో 130 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది వల్​నికాలోని జైలులో 68 మంది ఖైదీలు మరణించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన అల్లర్లలో 39మంది మృతి చెందారు. వెనెజువెలాలోని 30 జైళ్లలో 57వేలమంది ఖైదీలు వివిధ కేసుల్లో శిక్షలను అనుభవిస్తున్నారు.

ఇదీ చూడండి: జీ-20 సదస్సులో మోదీ-ట్రంప్​ భేటీ!

Surat (Gujarat), May 24 (ANI): At least 17 students were killed after a major fire broke out in a building in Sarthana area of Gujarat's Surat on Friday. Several students jumped out of windows on the top floor of building to escape the blaze. The fire broke out on the second floor of the coaching centre. As many as 18 fire tenders are present at the spot to douse the flames. The cause of the fire is yet to be ascertained.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.