అంతరిక్ష పర్యటకంలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. సంస్థ తయారు చేస్తున్న అంతరిక్ష నౌక ల్యాండింగ్, లాంచింగ్ కోసం అమెరికా న్యూమెక్సికోలోని ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. త్వరలో ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించి, రోదసిలో సరదాగా విహరించాలన్న కలను సాకారం చేయాలని భావిస్తోంది వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారి రిచర్డ్ బ్రాన్సన్ ఈ సంస్థ వ్యవస్థాపకుడు.
"అమెరికాలో వర్జిన్ గెలాక్టిక్ కోసం అంతరిక్ష నౌకాశ్రయం సాధ్యమైంది. న్యూ మెక్సికో అందుకు వేదికైంది. పెట్టుబడులూ రాబోతున్నాయి. విద్య, సాంకేతిక పురోగతితో మరిన్ని సాధ్యమవుతాయి."
-రిచర్డ్ బ్రాన్సన్, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష పర్యటన కోసం గతంలో ఓ వాహకనౌకను నిర్మించింది. 2014లో పరీక్షిస్తుండగా ఆ రాకెట్ రెండు ముక్కలైంది. పైలట్ మరణించాడు. ఆ వాహకనౌకలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది... అంతరిక్ష విహారానికి వాహనాన్ని సిద్ధం చేస్తోంది ఆ సంస్థ.
ఇదీ చూడండి: అట్టహాసంగా రష్యా 74వ 'విక్టరీ డే' వేడుకలు