ETV Bharat / international

ఇకపై లాలాజలం నమూనాతో కరోనా నిర్ధరణ! - అమెరికా కరోనా వైరస్​

లాలాజలం ఆధారంగా కరోనా నిర్ధరించే ప్రక్రియను అమెరికా ఆహార, ఔషధ యంత్రాంగం ఆమోదించింది. ఇది ఎంతో చౌకైనదని, సులభమైనదని అధికారులు వెల్లడించారు. ఈ సలైవా డైరక్ట్​తో పరీక్షల సామర్థ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

USFDA clears simple saliva test for faster detection of COVID-19
ఇకపై లాలాజలం నమూనాతో కరోనా వైరస్​ నిర్ధరణ!
author img

By

Published : Aug 16, 2020, 2:36 PM IST

లాలాజలం ఆధారిత కరోనా నిర్ధరణ పరీక్షలకు అమెరికా ఆహార, ఔషధ యంత్రాంగం(యూఎస్​ఎఫ్​డీఏ) ఆమోద ముద్రవేసింది. దీంతో ర్యాపిడ్ పరీ​క్షలు మరింత సులభంగా జరపవచ్చని పేర్కొంది. ఈ కొత్త విధానంతో పరీక్షల సామర్థ్యం పెరుగుతుందని.. వాటిలో వాడే కీలక రీఏజెంట్​ పరికరం కొరతను నివారించవచ్చని యూఎస్​ఎఫ్​డీఏ కమిషనర్​ స్టీఫెన్​ హాన్​ వెల్లడించారు.

నిజానికి... లాలాజలాన్ని ఉపయోగించి నిర్వహించే నాలుగు పరీక్షలను గతంలోనే ఆమోదించింది యూఎస్​ఎఫ్​డీఏ. కానీ అవి భిన్న ఫలితాలు ఇచ్చేవి.

వైరస్​ నిర్ధరణ విషయంలో అమెరికా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. పరికరాల కొరతతో పాటు వివిధ రకాల పరీక్షల్లో వెలువడే ఫలితాలు నమ్మే విధంగా ఉండేవి కాదు. ఈ నేపథ్యంలో ఈ కొత్త పరీక్షకు ఆమోదం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం ఈ 'సలైవా డైరక్ట్' ప్రక్రియ లక్షణాలు లేని​ బాధితులను గుర్తిస్తుందా? లేదా? అనే అంశంపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నేషనల్​ బాస్కెట్​బాల్​ ఎసోసియేషన్​ ఆటగాళ్లు, సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు.

ఈ సలైవా డైరక్ట్​ ఎంతో సులభమైనది, చౌకైనదని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- కొవిడ్‌ చికిత్స కోసం కొత్త ఔషధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.