కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది అమెరికా. యూఎస్‌ఏఐడీ ద్వారా 2.9 మిలియన్ డాలర్లను ఇవ్వనుంది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ వెల్లడించారు. ప్రాణాంతక వైరస్ నియంత్రణకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
కరోనాపై పోరులో యూస్‌ఏఐడీ, వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ), ఇతర సంస్థలు భారత్‌తో కలిసి పనిచేస్తాయని తెలిపారు జస్టర్. కరోనా వైరస్ ప్రపంచానికి పెను ముప్పులా మారిందిని, అన్ని ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు కలిసి కట్టుగా పనిచేస్తే ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని అభిప్రాయపడ్డారు.
గడిచిన 20 ఏళ్లలో భారత్‌కు అమెరికా మొత్తం 300 కోట్ల డాలర్లు ఆర్థిక సాయం చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు జస్టర్. ఇందులో 140 కోట్ల డాలర్లు ఆరోగ్య రంగానికి ఇచ్చినవేనని వివరించారు.
ఇదీ చూడండి: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మండలి సమావేశం