అమెరికాలోని దక్షిణ చికాగోలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి వేళ కాలిబాటపై నడుస్తూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. పాదచారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు చికాగో ట్రిబ్యూన్ నివేదించింది.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 29 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరో 9 మందికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో..
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన మరో ఘటనలో 13 మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే ప్రాంతమైన ఆస్టిన్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని.. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: విస్కాన్సిన్ క్యాసినోలో కాల్పుల కలకలం