ETV Bharat / international

'భారత్​పై ఆంక్షలా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు' - ఎస్-400 క్షిపణి వ్యవస్థ

రష్యా నుంచి ఎస్​-400 ఆయుధ వ్యవస్థను (S400 Air Defence system) కొనుగోలు చేసినందుకు భారత్​పై ఆంక్షలు విధించే (CAATSA sanctions) అంశంపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా వెల్లడించింది. అమెరికా భారత్ మధ్య ఇటీవల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరిందని... ఈ బలమైన బంధం కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. రష్యాతో లావాదేవీలు జరపొద్దని మిత్రదేశాలకు సూచించింది.

s400 air defence system
s400 air defence system
author img

By

Published : Nov 15, 2021, 12:32 PM IST

రష్యా నుంచి ఎస్400 గగనతల రక్షణ వ్యవస్థను (S400 Air Defence system) కొనుగోలు చేసిన భారత్​పై (S400 india) ఆంక్షల విషయంలో అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అగ్రరాజ్య రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. కాట్సా చట్టంలో దేశాలను బట్టి ఆంక్షలను (CAATSA sanctions) విధించే నిబంధన ఏదీ లేదని చెప్పారు. భారత్​ను ఆంక్షల నుంచి మినహాయించాలని (CAATSA sanctions India) పలువురు సెనేటర్ల నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. రష్యాతో ఎలాంటి రక్షణపరమైన లావాదేవీలను నిర్వహించవద్దని అమెరికా మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలను కోరారు.

"కాట్సాను ఉల్లంఘించి లావాదేవీలను రష్యాతో జరపకూడదని మా భాగస్వామ్య దేశాలను కోరుతున్నాం. రష్యాతో భారత్ ఆయుధాల లావాదేవీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేశాలను బట్టి ఆంక్షలను విధించే నిబంధన కాట్సాలో లేదు. అమెరికా భారత్ మధ్య ఇటీవల భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందింది. అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా భారత్ ఎదిగింది. ఇరుదేశాల మధ్య ఉన్న ఈ బలమైన బంధం కొనసాగాలని మేం కోరుకుంటున్నాం. భారత్​తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మేం విలువనిస్తున్నాం."

-అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి

అమెరికా ముప్పుగా తలెత్తే దేశాలపై ఆంక్షలు విధించేలా కాట్సా చట్టాన్ని (CAATSA sanctions) 2017లో తీసుకొచ్చారు. ఇప్పటివరకు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్​లపై ఈ చట్టం ప్రకారం ఆంక్షలు విధించారు. ఎస్400 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో 2018 అక్టోబర్​లో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికీ కాట్సా ప్రకారం చర్యలు (CAATSA India) ఉంటాయని అమెరికా తొలుత పేర్కొంది. అయితే, భారత్​పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అమెరికా చట్టసభ్యులు కోరుతున్నారు.

అమెరికాకే మంచిది కాదు!

భారత్‌ (s400 India) కొనుగోలు చేసిన ఎస్​-400 క్షిపణి వ్యవస్థ అందజేత ప్రక్రియ (S400 delivery to India) ప్రారంభమైందని రష్యా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్న నేపథ్యంలో ఆంక్షల అంశం తెరమీదికి వచ్చింది. మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్​ ప్రాధాన్యమిస్తోంది. దీనిపై తొలి నుంచి అమెరికా (s400 india-us) అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం వల్ల రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్​పై ఆంక్షలు విధిస్తే అమెరికాకు మంచిది కాదని అక్కడి చట్టసభ్యులు పేర్కొంటున్నారు.

ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్​కు ప్రత్యామ్నాయ మార్గాలను అమెరికా అందించాలని అగ్రరాజ్య సైనికాధికారులు సూచిస్తున్నారు. అమెరికా ఆయుధాలు కొనేలా భారత్​ను ప్రోత్సహించాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి: భారత్​కు త్వరలోనే ఎస్​-400 క్షిపణులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.