ETV Bharat / international

నాటో దేశాల జోలికొస్తే రంగంలోకి అమెరికా: బైడెన్​ - జో బైడెన్​

Joe biden on russia: నాటో సభ్య దేశాల వైపు రష్యా సైన్యం వస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు అధ్యక్షుడు జో బైడెన్​. తూర్పు ఐరోపాకు అదనపు బలగాలను పంపుతున్నట్లు వెల్లడించారు. శనివారం నాటో దేశాల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

US will be involved if Putin moves into NATO countries
పుతిన్​ నాటో దేశాల జోలికొస్తే రంగంలోకి అమెరికా: బైడెన్​
author img

By

Published : Feb 25, 2022, 10:52 AM IST

Joe biden news: ఉక్రెయిన్​పై దండయాత్ర చేస్తున్న రష్యా.. నాటో సభ్య దేశాలవైపు దూసుకొస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​. పుతిన్​ను ఇప్పుడు ఆపకపోతే మరింత రెచ్చిపోతాడని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షలు విధించిన అనంతరం ఈమేరకు శ్వేతసౌధంలో గురువారం మీడియాతో మాట్లాడారు.

"ఒకవేళ పుతిన్.. నాటో సభ్య దేశాల వైపు వెళ్తే మేం జోక్యం చేసుకుంటాం. నేను ఒప్పకునే ఏకైక విషయం ఏమిటంటే.. పుతిన్​ను ఇప్పుడు ఆపకపోతే అతని ధైర్యం మరింత పెరుగుతుంది. అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టకపోతే మరింత రెచ్చిపోతాడు. అందుకే రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. తూర్పు ఐరోపా దేశాలకు అవసరమైన బలగాలను సమకూర్చడం ద్వారా ఇది పెద్ద ఘర్షణకు దారీతీయదని మేము భావిస్తున్నాం. నాటో దేశాలు గతంలో ఎన్నడులేనంత ఐక్యంగా ఉన్నాయి. పుతిన్​తో మాట్లాడే ఆలోచన నాకు లేదు. ఆయన సోవియట్​ యూనియన్​ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులకు అతని ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.

Russia attack Ukraine

నాటో సభ్య దేశాల రక్షణ కోసం తూర్పు ఐరోపాకు అమెరికా అదనపు బలగాలను పంపిందని బైడెన్ వెల్లడించారు. ఉక్రెయిన్​కు మాత్రం వెల్లడం లేదని స్పష్టం చేశారు. నాటో దేశాలను కాపాడేందుకే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం నాటో దేశాల సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 30 దేశాలను సంఘటితం చేసి తదపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. నాటో కూటమిని మరింత శక్తమంతం చేస్తామన్నారు. నాటో దేశాల భూభాగాల్లోని ప్రతి అంగుళాన్ని కాపడతామని తేల్చి చెప్పారు.

గతేడాది ఉక్రెయిన్​కు 650మిలియన్ డాలర్లు విలువ చేసే రక్షణ సాయం అందించింది అమెరికా. ఆ దేశాన్ని నాటోలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరిగుతున్న సమయంలోనే రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్​పై దండయాత్రకు దిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.