అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. తన సెనేట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు అధికారిక రాజీనామా పత్రాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్‌కు సమర్పించినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. హారిస్ స్థానంలో కాలిఫోర్నియా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ అలెక్స్ పాడిలా బాధ్యతలు స్వీకరించనున్నారు.
గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు కమల. ఆ పదవిని అధిరోహించేందుకే సెనేట్‌కు రాజీనామా చేశారు. 100 సెనేటర్లు ఉండే అదే సభను త్వరలో అధ్యక్ష హోదాలో నడిపించనున్నారు. తన రాజీనామా.. అమెరికా సెనేట్‌కు వీడ్కోలు వంటిది కాదని, ఇది నూతన స్వాగతమని కమల పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అన్నీ తానై బైడెన్ సర్కార్‌ను నడిపే నారీశక్తి!