నిరుద్యోగ ప్రయోజనాలకు దరఖాస్తు చేసున్నవారి సంఖ్య గత వారం 4,73,000కు పడిపోయిందని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. కరోనా సమయంలో ఇదే అతి తక్కువ అని పేర్కొంది.
అమెరికా కార్మిక శాఖ నుంచి గురువారం వచ్చిన నివేదిక ప్రకారం, వారం ముందు సవరించిన 5,07,000 నుంచి నిరుద్యోగ భృతి దరఖాస్తులు 34,000 తగ్గాయి.
జనవరిలో 9 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా అది తాజాగా 4,73,000కు పడిపోయిందని పేర్కొంది.
టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయడం, మెల్లమెల్లగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండడం వల్ల నిరుద్యోగుల సంఖ్య తగ్గినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: చైనాలో మతపరమైన వివక్షపై అమెరికా ఫైర్