ETV Bharat / international

కరోనా.. ఆ పార్టీ ఉత్పత్తే: అమెరికా

కరోనా వైరస్​ చైనా సృష్టే అని ఆరోపించారు అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్​ నవారో. కరోనాను 'చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రోడక్టు'గా అభివర్ణించారు. వైరస్​ను​ సష్టించలేదని రుజువు చేసుకునే వరకు చైనానే అభియోగాలు మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

US trade adviser links virus to China government
'కరోనా వైరస్​ చైనా ప్రోడక్ట్'
author img

By

Published : Jun 22, 2020, 2:44 PM IST

కరోనా వైరస్​ను 'చైనీస్​ కమ్యూనిస్టు పార్టీ ప్రోడక్ట్​'గా అభివర్ణించారు అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్​ నవారో. ఆధారాలు కూడా దొరక్కుండా చైనా ప్రభుత్వమే కావాలని వైరస్​ను సృష్టించి ఉంటుందని ఆరోపించారు. వైరస్​ మూలాలకు సంబంధించి ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వుహాన్ ల్యాబ్​లో, జంతు విక్రయ మార్కెట్​లో ఏం జరిగిందనే సమాచారం తెలిస్తేనే వైరస్​ ఎలా ఉద్భవించిందనే విషయంపై ఓ అంచనాకు రావచ్చని చెప్పారు నవారో.

చైనీస్​ వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ పొరపాటున బయటకు వచ్చి ఉంటుందని ఇప్పటికే అనేక సార్లు నిరాధార ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, ఆయన మద్దతుదారాలు. వుహాన్​ మార్కెట్​ ద్వారానే జంతువుల నుంచి మనుషులకు వైరస్​ వ్యాప్తి మొదలైందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు.

వైరస్​ను తాము సృష్టించలేదని చైనా నిరూపించుకునే వరకు అభియెగాలు ఎదుర్కోవాల్సిందేనని పీటర్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.