ETV Bharat / international

'భారత్​కు సాయం చేసేందుకు నిర్విరామ కృషి'

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు అన్నిరకాలుగా సాయం అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఐరాసలో అమెరికా రాయబారి‌ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ తెలిపారు. వాక్సిన్​లకు కావాల్సిన ముడి పదార్థాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్​ మిషన్లను పంపిస్తున్నామని వివరించారు.

US Amb to UN
అమెరికా రాయబారి‌ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్
author img

By

Published : Apr 27, 2021, 5:00 AM IST

Updated : Apr 27, 2021, 6:24 AM IST

కొవిడ్​-19తో ధైర్యంగా పోరాడుతున్న భారత్​కు అన్నిరకాలుగా సాయం చేసేందుకు అమెరికా నిర్విరామంగా కృషి చేస్తోందని ఐరాసలో అమెరికా రాయబారి‌ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ స్పష్టం చేశారు. అర్జెంటీనా, జపాన్, నార్వే, దక్షిణాఫ్రికా దేశాలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఇలా వ్యాఖ్యానించారు. వాక్సిన్​లకు కావాల్సిన ముడి పదార్థాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్​ మిషన్లను పంపిస్తున్నామని వివరించారు.

" మా భాగస్వామి భారత్​కు సాయం చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాం. ఇతర దేశాలు సైతం భారత్​కు అండగా ఉండేందుకు ప్రోత్సహిస్తాం."

-- లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్, ఐరాసలో అమెరికా రాయబారి‌

'ప్రతీకకు సమయం కాదు'

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా ముందుకు రావటాన్ని భారతీయ అమెరికన్​ కాంగ్రెస్​ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి స్వాగతించారు. అయితే ఇది ప్రతీకకు సమయం కాదని, నోటి మాట కాకుండా ఇంకా సంసిద్ధంగా భారత్​కు సాయం అందించాలన్నారు.

ఇదీ చదవండి : భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!

Last Updated : Apr 27, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.