ETV Bharat / international

ట్రంప్​ గ్రీన్​సిగ్నల్​.. తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధం..!

author img

By

Published : Dec 4, 2019, 11:33 PM IST

అఫ్గానిస్థాన్​లో అమెరికా ప్రతినిధి అతి త్వరలో తాలిబన్లతో చర్చలు జరపనున్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ 3 నెలల క్రితం​... తాలిబన్లతో ఆకస్మికంగా చర్చలను నిలిపివేశారు.

us-to-restart-taliban-talks-after-trump-green-light
ట్రంప్​ గ్రీన్​సిగ్నల్​.. తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధం

తాలిబన్లతో మళ్లీ సమావేశమవనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించిన వారానికే పురోగతి కనిపించింది. అఫ్గానిస్థాన్​లో అమెరికా ప్రతినిధి జల్మాయ్​ ఖలీల్​జాద్​... చర్చలను పునరుద్ధరించడానికి ఇప్పటికే కాబూల్​ ​వెళ్లినట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

''తాలిబన్లు ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కాబూల్​లో ఉన్న జల్మాయ్​ ఖలీల్​జాద్​.. తాలిబన్లతో చర్చించేందుకు ఖతార్​ వెళ్లనున్నారు. శాంతి చర్చలు సానుకూలంగా సాగాలనుకుంటున్నాం. ముఖ్యంగా కాల్పుల విరమణకు దారి తీసే హింసను తగ్గించాలని చెబుతున్నాం.''

- అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన

ట్రంప్​ ఆకస్మికంగా...

18 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అమెరికా దళాలను అఫ్గానిస్థాన్​ నుంచి రప్పించే దిశగా అగ్రరాజ్యానికి-తాలిబన్లకు మధ్య కొద్ది నెలల కింద చర్చలు జరిగాయి. ఆ సమయంలో తాలిబన్లతో రహస్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. దాదాపు 3 నెలల తర్వాత.. ఇటీవల ఆకస్మికంగా అఫ్గానిస్థాన్​లో​ పర్యటించిన ట్రంప్​.. తాలిబన్లతో శాంతి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించారు.

'థ్యాంక్స్‌ గివింగ్‌’ రోజును పురస్కరించుకొని అఫ్గాన్​ వెళ్లారు ట్రంప్​. అక్కడి.. బగ్రామ్‌ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​లో ట్రంప్​ 'మెరుపు పర్యటన'- సైనికులతో కలిసి విందు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Riyadh, Saudi Arabia. 4th December 2019.
++CLIENT NOTE. THIS IS A FAST FILE EDIT - FURTHER SOUNDBITES TO FOLLOW IN ADDITIONAL EDIT ++
++STORYLINE AND SHOTLIST TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 00:44
STORYLINE:
Anthony Joshua looked ahead on Wednesday to his heavyweight world title rematch with Andy Ruiz Jr. in Riyadh, Saudi Arabia.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.