ETV Bharat / international

'హెచ్​1బీ' ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు!

హెచ్​1బీ విసా ఎంపిక విధానాన్ని మార్చనున్నట్లు అమెరికా తెలిపింది. ఇక నుంచి లాటరీ విధానానికి స్వస్తి పలికి.. ప్రతిభకే పెద్ద పీట వేయనున్నట్లు పేర్కొంది.

US to modify H1B visa selection process, to give priority to wages, skill level
హెచ్​1బీ విసా ఎంపిక ప్రక్రియను మార్చనున్న అమెరికా
author img

By

Published : Jan 8, 2021, 6:19 AM IST

హెచ్​1బీ విసా ఎంపిక ప్రక్రియను మార్చనున్నట్లు అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న లాటరీ పద్ధతి కాకుండా ఎంపికలో వ్యక్తి నైపుణ్యానికి, వేతనాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. శుక్రవారం తాజా నిబంధనను ఫెడరల్​ రిజిస్టర్​లో చేర్చనున్నట్లు పేర్కొంది. రిజిస్టర్​లో చేర్చినప్పటి నుంచి 60 రోజులు ఈ ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. తరువాతి హెచ్​1బీ వీసా ఎంపిక ప్రక్రియ ఎప్రిల్​ 1న ప్రారంభమవుందని పేర్కొన్నారు.

అమెరికా ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులకు ఎక్కువ జీతం పొందేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం వల్ల ఉద్యోగుల్ని నియమించుకోవడానికి కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగం కోసం రావడం వల్ల అమెరికా పౌరులకు అవకాశాలు సన్నగిల్లాయని పేర్కొంది. తక్కువ వేతనానికైనా సరే విదేశీయులు పనిచేయడం వల్ల అమెరికా పౌరులకు ఉద్యోగాలు లభించడం లేదని అధికారులు అంటున్నారు.
ఇదీ చూడండి: 'అమెరికాలో ప్రజాస్వామ్యంపై అసాధారణ దాడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.