ETV Bharat / international

యుద్ధనౌక నుంచి 'క్షిపణి రక్షణ కవచ' పరీక్ష - us mock missile hits target

ఇతర దేశాల నుంచి రక్షణపొందే దిశగా అమెరికా మరో క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఇందుకుగానూ ఇంటర్​సెప్టార్​ మిసైల్​ను ఏజీస్​ ఎస్​ఎం-3తో ఢీ కొట్టించింది. ప్రయోగం విజయవంతం అయినట్లు అమెరికా రక్షణ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

us successfully intercepts ICBM with ship launched missile
యుద్ధనౌక నుంచి 'క్షిపణి రక్షణ కవచ' పరీక్ష
author img

By

Published : Nov 18, 2020, 10:13 AM IST

శత్రువులు ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్​ క్షిపణుల (ఐసీబీఎం) నుంచి రక్షణ పొందేందుకు అమెరికా మంగళవారం కీలక ప్రయోగాన్ని నిర్వహించింది. ఒక నిరాయుధ క్షిపణిని విజయవంతంగా మార్గమధ్యంలోనే కూల్చేసింది. నిరోధక క్షిపణి (ఇంటర్​సెప్టార్​ మిసైల్​) ఏజీస్​ ఎస్​ఎం-3తో ఢీ కొట్టించడం ద్వారా ఈ పరీక్షను నిర్వహించింది.

ఈ దఫా తొలిసారిగా ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగాన్ని చేపట్టింది. గతంలో నేలమాళిగలో నుంచి ఇంటర్​సెప్టార్​ క్షిపణులను ప్రయోగించి, పరీక్షించేవారు. తాజా సామర్థ్యం వల్ల తమ క్షిపణి రక్షణ వ్యవస్థ విశ్వసనీయత మరింత పెరుగుతుందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్​' తెలిపింది. భారీగా ఖండాంతర క్షిపణులను పోగేసుకున్న ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పులను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ దేశాల్లో బలగాల ఉపసంహరణకు అమెరికా ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.