విశ్వంలోని పదార్థాల సేకరణలో భాగంగా నాసాకు చెందిన అంతరిక్ష నౌక ఓ గ్రహశకలంపై దిగనుంది. భూమికి 20 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలం నుంచి రాళ్లను తీసుకువచ్చేందుకు దీన్ని ప్రయోగించారు.
నాసాకు చెందిన ఒసిరిస్‌రెక్స్ రోదసి నౌక.. బెన్ను అనే గ్రహశకలంపై దిగనుంది. గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించడం అమెరికాకు ఇదే తొలిసారి కాగా... జపాన్ ఇప్పటికే రెండుసార్లు సేకరించింది. బెన్ను గురుత్వాకర్షణ శక్తి అంతరిక్ష నౌక దిగడానికి చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
రోబో చేయితో..
ఈ గ్రహశకలం పరిమాణం 1,670 అడుగులు మాత్రమే ఉంది. ఫలితంగా ఒసిరిస్‌రెక్స్ 11 అడుగుల రోబో చేయితో బెన్నును చేరుకొని.. రెండు ఔన్సుల రాయిని తీసుకొనేందుకు ప్రయత్నిస్తుంది. రెండు సంవత్సరాలుగా బెన్ను కక్ష్యలో ఉన్న ఈ నౌక, పరిశోధనకు సరిపోయే పదార్థాలున్న ఓ ప్రాంతాన్ని కనుగొంది. సదరు ప్రాంతంలో బెన్ను ఉపరితలాన్ని కదిలించేందుకు ఒత్తిడితో కూడిన నైట్రోజన్ వాయువును పంపిస్తారు.
-
The back-away burn is complete 🛑✅ I'm now moving to a safe distance away from Bennu. pic.twitter.com/bXk2ufSneS
— NASA's OSIRIS-REx (@OSIRISREx) October 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The back-away burn is complete 🛑✅ I'm now moving to a safe distance away from Bennu. pic.twitter.com/bXk2ufSneS
— NASA's OSIRIS-REx (@OSIRISREx) October 20, 2020The back-away burn is complete 🛑✅ I'm now moving to a safe distance away from Bennu. pic.twitter.com/bXk2ufSneS
— NASA's OSIRIS-REx (@OSIRISREx) October 20, 2020
అనంతరం ఏవైనా చిన్న గులకరాళ్లు లేదా దుమ్మును తీసుకుంటుంది.ఈ ప్రక్రియ కేవలం 5 నుంచి 10 సెకన్లు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ వెంటనే నౌక వెనక్కు వెళ్లిపోతుంది. ఈ నమూనాలు 2023 వరకు భూమికి చేరవని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి: బెన్ను గ్రహంపై కావాల్సినంత నీటి నిల్వలున్నాయి:నాసా