ఈ గదిలో కనిపిస్తున్న బూట్లు చాలా అరుదైనవి. నైక్ సహా ప్రముఖ బ్రాండ్లకు చెందిన దాదాపు 100 రకాల స్నీకర్స్ను వేలంపాట కోసం ప్రదర్శనలో ఉంచారు. అమెరికా ప్రముఖ వ్యాపార సంస్థ 'సదబీస్' తొలిసారి ఈ తరహా ప్రదర్శన ఏర్పాటు చేసింది.
నైక్ సంస్థ సహ వ్యవస్థాపకులు బిల్ బోవర్మన్ స్వయంగా రూపొందించిన 'మూన్ షూ' ఈ వేలంపాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 1972 ఒలింపిక్స్ ట్రయల్స్ కోసం వీటిని తయారు చేశారు బిల్.
బిల్ బొవెర్మన్ రూపొందించిన 'మూన్ షూ'ను ఇక్కడ ప్రదర్శనకు ఉంచాము. ఇలాంటి స్నీకర్స్ మీరు ఎక్కడా చూడలేరు. వీటిని 80 వేల డాలర్ల ప్రారంభ ధరతో వేలంపాటలో ఉంచాము. వీటి ధర 1.6 లక్షల డాలర్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నాం.
-నోహ్ వంచ్, సదబీస్ ఈకామర్స్ హెడ్
ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టు ఫ్యూచర్' మోడల్ షూను 2011, 2016లో ప్రత్యేక కార్యక్రమం కోసం తయారు చేశారు. ఈ రెండు జతల షూ ప్రదర్శనలో ఉంచారు.
అమెరికా పాపులర్ బేస్బాల్ క్రీడాకారుడు డెరెక్ జెటర్స్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 40 జతల స్నీకర్స్నూ వేలంపాటలో అందుబాటులో ఉంచారు. వీటి ధర 30వేల డాలర్లు.
జులై 11 న ప్రారంభమైన ఈ ప్రదర్శన జులై 23 వరకు కొనసాగనుంది.
ఇదీ చూడండి: బాలుడ్ని రేప్ చేసిన టీచరమ్మకు 20ఏళ్ల జైలు