ETV Bharat / international

వారాంతంలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి - us killings

అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఘటనా స్థలంలోనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

usa
అమెరికా
author img

By

Published : Nov 28, 2021, 5:39 AM IST

వారాంతంలో అమెరికాలో కాల్పుల మోత మోగింది. నాష్‌విల్లేలోని టెన్నెస్సీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.

'గుర్తుతెలియని దుండగులు అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా ప్రవేశించారని.. వారి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని' పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

బాధితుల పేర్లు, వయస్సు వివరాలను వెల్లడించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.