కీలక వలస సంస్కరణల బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేసింది. అమెరికాలో ఉన్న వందలాది మంది భారతీయ ఉద్యోగులకు ఈ బిల్లు ప్రయోజనం చేకూర్చనుంది. సదరు బిల్లును సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం.
బిల్లులో ఏముంది?
- దేశాలవారీగా వలసదారులకు ఇచ్చే వీసాలపై ఉన్న సంఖ్యాపరమైన పరిమితిని ఈ బిల్లు ఎత్తివేసింది.
- కుటుంబ పరమైన వీసాల సంఖ్యను పెంచుతుంది.
ఎవరికి లాభం..?
ఈ హై-స్కిల్డ్ ఇమ్మింగ్రెంట్స్ యాక్ట్ వల్ల యూఎస్‌లో పనిచేస్తోన్న భారత ఐటీ ఉద్యోగులకు ఎంతో లాభం చేకూరనుంది. హెచ్1బీ వీసాలు తీసుకుని గ్రీన్‌కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్నవారి నిరీక్షణ ఫలించనుంది.
- ఇదీ చూడండి: చంద్రుడి నమూనాలతో 'చాంగే-5' తిరుగు ప్రయాణం!