ETV Bharat / international

అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్​ - అమెరికా రక్షణ మంత్రికి కరోనా

Us secretary of defence corona positive: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్​కు కరోనా నిర్ధరణ అయింది. కొవిడ్ టీకా బూస్టర్ డోసు కూడా తీసుకున్నప్పటికీ ఆయన కరోనా బారినపడ్డారు.

Us secretary of defence corona positive
అమెరికా రక్షణ మంత్రికి కరోనా
author img

By

Published : Jan 3, 2022, 7:03 AM IST

Us secretary of defence corona positive: అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా.. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్​కు కరోనా సోకింది.

"లక్షణాలు కనపించగా పరీక్షలు చేయించుకున్నాను. అందులో కొవిడ్ సోకినట్లు తేలింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వైద్యుల సలహాను పాటిస్తున్నాను" అని ఆస్టిన్​ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆస్టిన్​ కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రెండు డోసుల కొవిడ్ టీకా డోసుతో పాటు బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ ఆస్టిన్ కరోనా బారినపడడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.