ETV Bharat / international

కరోనా బాధితుల పర్యవేక్షణకు బుల్లి పరికరం

కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు ప్రత్యేకమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. తపాలా స్టాంపు పరిమాణంలో ఉండే ఈ పరికరం రోగుల్లోని శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని నమోదు చేస్తుంది.

small device for monitoring corona victims
బుల్లి పరికరం
author img

By

Published : Jul 3, 2020, 9:11 AM IST

కరోనా బాధితుల పర్యవేక్షణ కోసం తపాలా స్టాంపు పరిమాణంలో ఒక పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అందులో శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని నమోదు చేయడానికి అనేక సెన్సర్లు ఉన్నాయి. దీనివల్ల బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, వ్యాధి లక్షణాలను చాలా ముందుగానే పసిగట్టి, సకాలంలో వైద్యం చేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.

ఈ పరికరం చాలా మృదువుగా, ఎటుపడితే అటు వంచగలిగేలా ఉంటుంది. బాధితుల గొంతు భాగంలో దీన్ని అమర్చాల్సి ఉంటుంది. ఇది వైర్‌లెస్‌ సాధనం. కరోనా బాధితుల్లో వ్యాధి లక్షణాలకు సంబంధించిన వివరాలను వైద్యులకు చేరవేస్తుంది. ఇది చర్మంలోని చాలా స్వల్ప స్థాయి ప్రకంపనలను కూడా పట్టుకోగలదు. జ్వరాన్ని లెక్కించడానికి ఉష్ణోగ్రత సెన్సర్‌ కూడా ఉంది.

"బాధితుడు శ్వాసిస్తున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు ఈ పరికరం లెక్కిస్తుంది. దగ్గు తీవ్రతను పర్యవేక్షిస్తుంది. శ్వాసను కష్టంగా తీసుకుంటుంటే దాన్ని పసిగడుతుంది. అలాగే రక్తప్రవాహం తీరును, గుండె స్పందనను పర్యవేక్షిస్తుంది."

-జాన్ ఏ రోజర్స్, పరిశోధకుడు

ఇప్పటికే ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. తద్వారా 3వేల గంటల డేటాను సేకరించారు. వీటిని విశ్లేషించి, పరికరంలోని ఆల్గారిథమ్‌లను మరింత మెరుగుపరుస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి: మాస్కులు ధరించడం ఆరోగ్యానికి హానికరమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.