ETV Bharat / international

​జే&జే సింగిల్ డోసు టీకా పంపిణీ నిలిపివేత! - జాన్సన్ టీకా పంపిణీ నిలిపివేత అమెరికా

జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోసు టీకా పంపిణీని నిలిపివేయాలని యూఎస్ ఎఫ్​డీఏ, సీడీసీ సూచించాయి. రక్తం గడ్డకడుతున్న దాఖలాలు వెలుగులోకి రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐరోపాకు సరఫరా చేయాల్సిన డోసులను కొద్ది కాలంపాటు నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

us-recommends-pause-for-j-and-j-vaccine-over-clot-reports
అమెరికాలోజాన్సన్ అండ్ జాన్సన్ టీకా నిలిపివేత
author img

By

Published : Apr 13, 2021, 10:17 PM IST

జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోసు వాడకాన్ని నిలిపివేయాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థలు నిర్ణయించాయి. రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న నివేదికలపై దర్యాప్తు చేసేందుకు తాజా ప్రతిపాదన చేశాయి. ఈ మేరకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ), ఆహార ఔషధ సంస్థ(ఎఫ్​డీఏ) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

వ్యాక్సిన్ వల్ల తలెత్తుతున్న సమస్యలపై చర్చించేందుకు సీడీసీ అడ్వైజరీ కమిటీ బుధవారం భేటీ కానుంది. దీనిపై ఎఫ్​డీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది.

ఇప్పటివరకు 68 లక్షల డోసుల జాన్సన్ టీకాలను అమెరికాలో అందించారు. అందులో ఆరుగురు మహిళలకు రక్తం గడ్డకట్టినట్లు తేలింది. తాజా ఆదేశాలతో అమెరికా ఫెడరల్ కేంద్రాల్లో వెంటనే ఈ టీకా పంపిణీ నిలిచిపోనుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టీకా పంపిణీని నిలిపివేస్తాయి. అయితే.. మోడెర్నా, ఫైజర్ డోసుల పంపిణీ మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.

ఐరోపాకు సరఫరా వాయిదా

మరోవైపు, వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు, అమెరికా దర్యాప్తు వంటి అంశాలు.. సింగిల్ డోసు టీకా సరఫరాపై ప్రభావం చూపాయి. ఐరోపాకు డోసుల సరఫరాను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది.

ఇదీ చదవండి: 'కరోనా కథ ముగియలేదు.. టీకా ఒక్కటే మార్గం కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.