ETV Bharat / international

అధ్యక్ష పోరు: కీలక సమస్యలపై ట్రంప్​-బైడెన్​ వైఖరేంటి ? - మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్​​

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. పోలింగ్​ డే (నవంబర్​ 3) దగ్గరకు సమీపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ప్రత్యర్థి బైడెన్​​ హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రచార పర్వంలో దూసుకెళ్తూ.. పోటీని రసవత్తరంగా మార్చేశారు. మరోసారి అమెరికాను అగ్రస్థానంలో నిలుపుతానని, పన్నులు తగ్గిస్తానని ట్రంప్​ అంటుంటే.. సమాఖ్య వ్యవస్థ, జాత్యహంకారం వంటి అంశాలతో బైడెన్​ ముందుకొస్తున్నారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శల సంగతి సరేసరి. మరి అమెరికాలో కీలకంగా ఉన్న సమస్యలపై ఇరువురి మాటేంటి ?

Trump and Biden
అధ్యక్ష పోరు: ఎన్నికల్లో కీలక సమస్యలపై ట్రంప్​-బైడెన్​ల వైఖరేంటి ?
author img

By

Published : Oct 17, 2020, 12:26 PM IST

డొనాల్డ్ ట్రంప్... పన్ను తగ్గింపు, రెగ్యులేటరీ కోతల హామీలతో తనని తాను సంప్రదాయవాదిగా చెబుతున్నారు. అదే సమయంలో బైడెన్‌ను సోషలిస్ట్ వ్యంగ్య చిత్రంగా అభివర్ణిస్తున్నారు. కరోనా వైరస్​ను ఎదుర్కోవటానికి, ఆర్థిక వ్యవస్థను పునర్​ నిర్మించడానికి.. శతాబ్దాలుగా పట్టిపీడిస్తున్న జాత్యహంకారం, అసమానతలను తొలగించేలా సమాఖ్య ప్రభుత్వాన్ని నడిపిస్తానని ట్రంప్​ ప్రత్యర్థి జో బైడెన్​ చెబుతున్నారు. రెండు పూర్తి విభిన్న విధానాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం అమెరికన్లకు వచ్చింది.

అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి శ్వేతసౌధంలో అడుగుపెడితే పన్నుల విషయంలో ఎలా వ్యవహరిస్తామనేది, అలాగే.. అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామనేది ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బైడెన్​ది వామపక్ష భావజాలం అంటూ విరుచుకుపడుతున్నారు.

మరోవైపు పూర్తిగా సామాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కరోనా సహా వివిధ సమస్యలపై కలిసికట్టుగా పోరాడదామని బైడెన్​ పిలుపునిస్తున్నారు. ట్రంప్ చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుతామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో దేశంలోని కీలక సమస్యలపై వీరి వైఖరి ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తికరంగా మారింది.

కరోనా వైరస్..

కరోనా అమెరికాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో.. వైరస్​పై పోరు ఇరువురు నేతల భవిష్యత్తు నిర్ణయించటంలో కీలకంగా మారింది.

ట్రంప్​

  • కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించటంలో ట్రంప్​ విఫలమయ్యారన్న వాదనలున్నాయి.
  • కరోనావైరస్​ను ట్రంప్ తక్కువ చేసి చూపించారని.. అమెరికన్లు గుర్రుగా ఉన్నారు.
  • ట్రంప్ మరోసారి ఎన్నిక కావడంలో కరోనానే కీలకంగా నిలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆధ్యక్షుడికి వైరస్​ సోకటం ప్రతికూలంగా మారే అవకాశముంది.
  • 10 మందిలో ఏడుగురు అమెరికన్లు కరోనాపై పోరులో దేశం తప్పటడుగు వేసిందని భావిస్తున్నారు. కేవలం 39శాతం మంది ట్రంప్​ పనితీరును సమర్థించారు.
  • మార్చి-ఏప్రిల్​లో అమెరికన్​ కాంగ్రెస్​ 3ట్రిలియన్​ డాలర్లు నిధులు విడుదల చేసింది.
  • దేశవ్యాప్త పరిస్థితులపై ట్రంప్​నే బాధ్యులుగా చూస్తున్నారు.

బైడెన్

  • ట్రంప్​ విధానాలను బైడెన్​ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైరస్​పై పోరులో పూర్తిగా అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.
  • రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలతో పాటు వ్యాపారాలకు సహాయం చేయడానికి ​​సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేస్తానంటున్నారు బైడెన్.
  • ఆపత్కాలంలో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ పనితీరు సమీక్షిస్తామని హామీ ఇస్తున్నారు.
  • శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రజలకు నిరంతరం సూచనలు అందించే వ్యవస్థ తీసుకొస్తామంటున్నారు.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థలోకి అమెరికాను తిరిగి చేరుస్తామని, దేశవ్యాప్తంగా మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేస్తామని చెబుతున్నారు.

విద్యావ్యవస్థ

విద్యా వ్యవస్థ, పాఠశాలల నిర్వహణపై కరోనా తర్వాత అమెరికాలో అనేక సందేహాలు రెకెత్తాయి. వీటి పరిష్కారం ఎన్నికల్లో కీలకాంశంగా మారింది.

ట్రంప్​

  • పాఠశాలలు పూర్తిగా తెరవాలని ట్రంప్ ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
  • ప్రాథమిక పాఠశాలలు వీలైనంత త్వరగా తెరవాలని సూచిస్తున్నారు.
  • అయితే పాఠశాలలు తెరవటం వెనుక ట్రంప్​ మతలబు వేరుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో నిడిచే ఛార్టర్​ స్కూల్​లకు గ్రాంట్​ల రూపంలో నిధులు అందుతాయి. పాఠశాలలు తెరిస్తే.. వారికి నిధులు అందించి ఆకట్టుకోవాలని ట్రంప్​ చూస్తున్నారంటున్నారు పరిశీలకులు.
  • విశ్వవిద్యాలయాలు విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని రుద్దుతున్నాయని ఆరోపిస్తున్నారు. వాటికి అందించే నిధులు, పన్నుల మినహాయింపుపై సమీక్ష జరపాలనే ఆలోచనలో ఉన్నారు.

బైడెన్​

  • కరోనా కారణంగా మరిన్ని నిధులు విద్యాసంస్థలకు అందించాలని బైడెన్​ సూచిస్తున్నారు. సమాఖ్య చట్టం ద్వారా.. విపత్తుల సమయంలో సాయమందిస్తామని చెబుతున్నారు.
  • తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వ చేయూతనందిస్తామని చెబుతున్నారు. పదేళ్లలో 850బిలియన్ డాలర్లు ఖర్చు చేసేలా బృహత్తర ప్రణాళిక రూపొందించారు.
  • విద్యసంస్థల్లో మౌలిక సదుపాయాల పెంపు, అల్పాదాయ వర్గాలకు ఉన్నత విద్య వంటి అంశలపై ప్రత్యేక దృష్టి సారిస్తామంటున్నారు.

ఆరోగ్య సంరక్షణ
కరోనా వైరస్ విలయం తర్వాత... దేశ ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. అలాగే, ఒబామా హెల్త్​కేర్​ చర్చనీయాంశమైంది. ప్రజలతో ముడినపడిన ఈ అంశంలో అధ్యక్ష అభ్యర్థుల వైఖరి అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

ట్రంప్​

  • అధ్యక్షుడు అవ్వకముందు ట్రంప్​.. 2016లో ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే.. ఒబామా హెల్త్​కేర్ స్థానంలో అందిరికీ బీమా అందించే పథకం తీసుకొస్తామని చెప్పారు.
  • అమెరికన్లు ఇప్పటికీ కార్యరూపం దాల్చని ఆ కొత్త ఆరోగ్య పథకం కోసం ఎదురుచూస్తున్నారు.
  • ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఈ అంశంపై హామీలు గుప్పిస్తున్నారు ట్రంప్. ధరల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెబుతున్నారు.
  • వైద్యవ్యవస్థలో పారదర్శకత తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు.

బైడెన్

  • ఒబామా కేర్​ను మరింత విస్తరిస్తామని బైడెన్​ చెబుతున్నారు. ప్రజలకు సేవలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు.
  • ​బీమా సౌకర్యం అందిరికీ కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించామని చెబుతున్నారు. 10 ఏళ్లలో 750బిలియన్​ డాలర్లు ఖర్చు చేసేలా కార్యాచరణతో ముందుకొచ్చారు.
  • సుప్రీం కోర్టులో ఆరోగ్య సంరక్షణ విధానాలపై పోరాడుతామని చెబుతున్నారు.

విదేశాంగ విధానం

అంతర్జాతీయంగా ఆంక్షలతో విరుచుకుపడిన అమెరికా.. కొన్ని దేశాలకు దూరమైంది. మరోవైపు చైనా ఆధిపత్య ధోరణి అగ్రరాజ్యానికి ప్రమాద హేతువుగా పరిణమించింది.

ట్రంప్

  • అధికారం చేపట్టిన తర్వాత.. అధ్యక్షుడు ట్రంప్​ విదేశాంగ విధానం మొత్తం 'అమెరికా ఫస్ట్​' అన్న సూత్రం చుట్టే తిరిగింది.
  • ఎన్నికలకు ముందు ట్రంప్ మధ్యప్రాచ్యంలో శాంతి పవనాల కోసం కృషి చేసిన క్రెడిట్​ దక్కించుకున్నారు.
  • గతంలో హామీ ఇచ్చిన మెక్సికో గోడ విషయంలో 320కిలో మీటర్ల నిర్మాణం గొప్ప విజయంగా భావిస్తున్నారు. అలాగే రక్షణ రంగంపై జీడీపీలో 2శాతం కేటాయింపులు చేస్తున్నారు.
  • అఫ్ఘానిస్థాన్​ నుంచి బలగాల ఉపసంహరణ, పారిస్​ ఒప్పందం నుంచి తప్పుకోవటం కలిసొస్తాయని ఆశిస్తున్నారు.
  • ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్​తో చర్చలు చారిత్రక సందర్భంగా చెబుతున్నారు.

బైడెన్​

  • ట్రంప్​ నిర్ణయాల కారణంగా దూరమైన మిత్రదేశాలతో తిరిగి సయోధ్య కుదుర్చుకుంటామని బైడెన్​ చెబుతున్నారు.
  • నాటో దళాలను పునరుద్ధరిస్తామని, ఐరోపా-ఆసియాల్లో పెరుగుతున్న రష్యా దూకుడుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అంటున్నారు.
  • ప్రపంచ శాంతి స్థాపనలో అమెరికా కీలకంగా వ్యవహరిస్తుందని చెబుతూనే.. ప్యారిస్​ ఒప్పందం, కర్బన ఉద్ఘారాలపై అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు.

వాణిజ్యం

అంతర్జాతీయ వాణిజ్యంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా.. పన్నులతో ఇతర దేశాలను బెంబేలెత్తిస్తోంది. చైనాతో ట్రేడ్​వార్​ కొత్త సమస్యలు సృష్టించింది.

ట్రంప్

  • మెక్సికో-కెనడాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపిన ట్రంప్​.. చైనాతో వ్యవహరించిన తీరు తన విజయాలుగా చెబుతున్నారు.
  • ఫేజ్​-1 విధానంతో వ్యవసాయ, విద్యుత్​ రంగాల్లో కీలక మార్పులు జరిగాయని చెబుతున్నారు. చైనా దిగుమతులపై అధిక సుంకాలతో బెంబెలెత్తించి దిగొచ్చేలా చేశామని ట్రంప్​ అంటున్నారు.
  • ఫేజ్​-2 ఒప్పందం ద్వారా.. మరిన్ని లాభాలు చేకూరతాయని ట్రంప్​ వర్గం ప్రచారంలో హోరెత్తిస్తోంది.

బైడెన్​

  • బైడెన్​ అంతర్జాతీయంగా సులభతర వాణిజ్యంపై దృష్టి సారించనట్లుగా చెబుతున్నారు. అలాగే అమెరికా ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా దేశ వాణిజ్యానికి ఊతమివ్వాలని చూస్తున్నారు.
  • దేశ సాంకేతిక సంస్థలకు 300బిలియన్ల సాయం చేయాలంటున్నారు. ఈ పెట్టుబడులు అంతర్జాతీయ వాణిజ్యం సమకూర్చాలని సూచిస్తున్నారు.
  • మిత్ర దేశాలతో సులభతర వాణిజ్యం ద్వారా దేశీయ వాణిజ్యానికి కొత్త శక్తినిస్తామంటున్నారు.

ఆర్థిక వ్యవస్థ-పన్నులు

కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం ఇప్పుడు కీలకంగా మారింది. పన్నులపై ఇరువురు నేతల వాదనలు వేర్వేరుగా ఉన్నాయి.

ట్రంప్

  • తక్కువైన నిరుద్యోగం, స్టాక్​ మార్కెట్ల పరుగులపై గొప్పగా చెప్పుకున్న ట్రంప్​ను.. కరోనా సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేసింది. స్టాక్​ మార్కెట్లు కుప్పకూలగా.. నిరుద్యోగం 7.9శాతానికి చేరింది.
  • 2008-09 ఆర్థిక మాంద్యం కన్నా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
  • ఈ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థను పరగులు పెట్టిస్తే ఎన్నికల్లో తనకు కలిసొస్తుందని ట్రంప్​ భావించారు. కరోనా పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.
  • కరోనా వ్యాక్సిన్​పైనా ఆయన భిన్నవ్యాఖ్యలు చేశారు. ఆయన పన్నుల విధానంపైనా వ్యతిరేకత ఎక్కువగా వస్తోంది.
  • మరోసారి గెలిపిస్తే... పన్నుల అంశంలో ఊరట కల్పిస్తామని ఆయన చెబుతున్నారు.

బైడెన్

  • కరోనా అంతమయ్యేవరకూ ఆర్థిక వ్యవస్థ చక్కబడదని బైడెన్ వాదిస్తున్నారు. ​
  • వ్యవస్థ పునరుద్ధరణ కోసం, మాంద్యాన్ని నివారించడానికి.. అలాగే సంపద అసమానతను పరిష్కరించడానికి విస్తృతమైన సమాఖ్య వ్యవస్థను చక్కదిద్దుతామంటున్నారు.
  • కాలుష్యం నివారణకు.. 2 ట్రిలియన్ల ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే, ప్రణాళికల్లో భాగంగా వివిధ రంగాల్లో ఉద్దీపన పథకాల ప్రకటనకు పూనుకున్నారు.
  • అలాగే, నిరుద్యోగం, తక్కువ వేతనాలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
  • ఈ నేపథ్యంలో పదేళ్లలో 4ట్రిలియన్​ డాలర్లు సమకూర్చేలా పన్నుల పెంచుతామని వెల్లడించారు.
  • అలాగే వలసలపైనా దృష్టి సారించారు. 1.1కోట్ల మందికి పౌరసత్వం ఇస్తామని వెల్లడించారు.

అబార్షన్లు..

స్వేచ్ఛాయుత అమెరికాలో అబార్షన్ల వివాదం.. ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో కీలక సమస్యల్లో ఒకటిగా మారింది.

ట్రంప్

  • కొన్ని సంవత్సరాల ముందు, ట్రంప్ తనను తాను బలమైన గర్భస్రావం హక్కుల ప్రతిపాదకుడిగా చెప్పుకున్నారు. కానీ వాషింగ్టన్‌కు వచ్చినప్పటి నుంచి.. గర్భస్రావం నిరోధక బృందాలకు మద్దతుగా నిలుస్తున్నారన్న వాదనలు ఉన్నాయి.
  • అధ్యక్షుడిగా, దేశవ్యాప్తంగా గర్భస్రావం చట్టబద్ధం చేయాలన్న డిమాండ్​ను వ్యతిరేకించారు. రోయి వి. వేడ్ సూచనలను తప్పుబట్టారు.
  • అబార్షన్లపై కఠినంగా వ్యవహరిస్తూ.. ఖర్చులు ప్రభుత్వం చెల్లించేందుకు వ్యతిరేకించారు. నిరోధక మందులపై ఆంక్షలు విధించారు.
  • ఆ అంశం కోర్టులో ఉండగానే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బైడెన్​

  • రోయి వి. వేడ్ సూచనలకు తాను మద్దతు తెలుపుతున్నట్లుగా బైడెన్​ ప్రకటించారు. గర్భం తొలగింపు మహిళ ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు.
  • అబార్షన్​ చట్టబద్ధం చేస్తామన్న సంకేతాలను బైడెన్ ఇచ్చారు.
  • గర్భస్రావం నైతిక సమస్యగా బహిరంగంగా మాట్లాడారు.
  • దేశవ్యాప్తంగా రిపబ్లికన్ శాసనసభలు గర్భస్రావం చేయడాన్ని పరిమితం చేశాయని వాదిస్తున్నారు.
  • హైడ్ సవరణ పేద లేదా శ్రామిక-తరగతి మహిళలకు రాజ్యాంగబద్ధమైన హక్కు పొందటానికి అవరోధంగా మారిందని ఆరోపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.