ఎన్నికల సమయంలో ఏళ్లుగా టెలివిజన్ నెట్వర్క్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా.. ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు, విజయావకాశాలు, ప్రజలు ఎందుకు ఓట్లేశారు.. అన్న అంశాలు తెలిజేసేవి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వీటి పాత్ర కీలకంగా ఉంటుంది.
అయితే, ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. ఓటేసే విధానం మారింది. ముఖ్యంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో 10మందిలో నలుగురు అమెరికన్లు.. ఎలక్షన్ డేకు ముందే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎక్కువగా మెయిల్ రూపంలోనో.. లేదంటే పోలింగ్ కేంద్రాల వద్దనో ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యం కాదు. మారిన పరిస్థితుల దృష్ట్యా కచ్చితమైన అంచనాలను తెలియజెప్పేందుకు అమెరికన్ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కొత్త విధానం తీసుకొచ్చింది. అదే ఏపీ ఓట్కాస్ట్' కార్యక్రమం.
రూపకల్పన ఎప్పుడు..
2018లో స్వతంత్ర పరిశోధనా సంస్థ ఎన్ఓఆర్సీ, షికాగో విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది సంప్రదాయ అభిప్రాయ సేకరణకు భిన్నంగా.. ఈరోజు అమెరికన్లు ఎలా ఓటు వేస్తారో ప్రతిబింబించేలా కచ్చితమైన విధానంగా అభివర్ణిస్తున్నారు. ముందస్తు పోలింగ్, మెయిల్ ఓటర్ల అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది.
ఆ ఎన్నికల్లో సత్ఫలితాలు..
2018లో జరిగిన సెనేట్, గవర్నర్ ఎన్నికల్లో విజయవంతగా ఓట్కాస్ట్ విధానం పనిచేసింది. ఎలక్షన్ డేకు ముందే ఓట్లేసిన వారి అభిప్రాయాలు సైతం సేకరించగలిగారు. అనంతరం సర్వే నమూనా.. యూఎస్ సెన్సస్ బ్యూరో నెలల తరువాత విడుదల చేసిన చేసిన జనాభా లెక్కలతో సరిపోలింది.
సర్వే ఇలా..
ఈ ఓట్కాస్ట్లో మెయిల్, ఆన్లైన్ సర్వేలు, ఫోన్ కాల్స్ ద్వారా అమెరికన్ల అభిప్రాయాలు సేకరిస్తారు. నమోదు చేసుకున్న ఓటర్లందరి అభిప్రాయాలు తీసుకుంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో - ఓటు వేయకూడదని నిర్ణయించుకునే వారి అభిప్రాయాలు సైతం లెక్కగడుతుంది.
ఈ తరహా లోతైన విశ్లేషణ వివిధ వర్గాలు, విభిన్న ప్రాంతాల్లోని ఓటర్ల మనోగతం తెలియజేస్తుంది. కీలకమైన అంశాల్లో పూర్తిస్థాయి అవగాహన రావటానికి తోడ్పడుతుంది.
ప్రస్తుతం ఏపీ ఓట్కాస్ట్ ఎలక్షన్ డే (నవంబర్ 3)కు ముందే.. అమెరికాలోని 50రాష్ట్రాల్లో 1,40,000 ఇంటర్వూలు చేపట్టారని నిర్ణయించింది. అయితే, ఎన్నికల్లో విజేత ఎవరవుతారో వెల్లడించాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
మొత్తంగా ఏపీ ఓట్కాస్ట్ విధానం.. అమెరికన్ ఓటర్ల అభిప్రాయమేంటో తెలుసుకోవటంలో కీలకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: భారీ రెడ్ వేవ్ సమీపిస్తోంది: ట్రంప్
ఇదీ చూడండి: రంగంలోకి ఒబామా- జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం