ETV Bharat / international

ట్రంప్​ X బైడెన్​: వాడీవేడిగా తొలి డిబేట్​ - అమెరికా ఎలక్షన్ డిబేట్ న్యూస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య క్లీవ్‌లాండ్ వేదికగా జరిగిన మొదటి ఎన్నికల చర్చ వాడీవేడీగా సాగింది. కరోనా విజృంభణ, నల్లజాతీయుల నిరసనలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్నిక, ఆర్థికవ్యవస్థ, పర్యావరణం, ఎన్నికల సమగ్రత వంటి అంశాలపై ఇరువురు అభ్యర్థులు తమ అభిప్రాయాలను, విధానాలను వెల్లడించారు.

U.S. presidential debate Trump, Biden spar over Supreme Court, health care, coronavirus
ఆర్థిక, సామాజిక చర్చ నుంచి వ్యక్తిగత విమర్శల వరకు
author img

By

Published : Sep 30, 2020, 11:07 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికల చర్చలో రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ పలు అంశాలపై తమ వైఖరిని వెల్లడించారు. ఒబామా హెల్త్‌ కేర్, కరోనా కట్టడికి సంబంధించి అబద్ధాలు చెబుతున్నారంటూ ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంపికైనా ఇరువురి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కొత్త న్యాయమూర్తి ఎంపికపై బైడెన్ అభ్యంతరం తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందన్నారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్​ తిప్పికొట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంపిక విషయంలో తనకు పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టంచేశారు.

ప్రజారోగ్యంపై...

ఆరోగ్య విధానంపై ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళిక లేదని బైడెన్ విమర్శించారు. ఒబామా కేర్‌ను రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. కరోనాపై పోరులో ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థిక వ్యవహారాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.

"రెండు లక్షలకుపైగా మరణాలు, 70 లక్షలకుపైగా కరోనా కేసులు కేవలం మీ వల్లే నమోదయ్యాయి. కరోనా నివారణకు ట్రంప్‌ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. ప్రణాళిక రచించేందుకు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది చివరికల్లా మరో 2 లక్షల మంది అమెరికన్లు కరోనాతో మరణిస్తారని మీ సీడీసీ డైరెక్టరే వెల్లడించారు. కేవలం మాస్కు ఉంటే వేల మంది ప్రాణాలు కాపాడవచ్చు. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ట్రంప్‌పై మాకు నమ్మకం లేదు. శాస్త్రవేత్తలపై మాత్రమే నమ్మకం ఉంది."

-జో బైడెన్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి

అయితే.. ఆరోగ్యబీమాను రద్దుచేయలేదని ట్రంప్ స్పష్టం చేశారు. తక్కువ ధరలో ఔషధాలు అందించేందుకే ప్రయత్నించానని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తాను అబద్ధాలు చెప్పడం లేదని, బైడెన్ చెప్పేవే అబద్ధాలంటూ ఎదురు దాడి చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో తమ పనితీరుకు ఫౌచీ ప్రశంసలే నిదర్శనమన్నారు. మరికొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

"చైనాలో కరోనా వల్ల ఎంతమంది మరణించారో మీకు తెలుసా? రష్యాలో, భారత్‌లో ఎంతమంది మృతి చెందారో తెలుసా? కరోనా నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ అద్భుతంగా పనిచేశారని డెమొక్రటిక్‌ గవర్నర్లే కితాబిచ్చారు. మేం మాస్కులు, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచాం. కరోనా వ్యాక్సిన్‌ తయారీకి కొన్ని వారాల దూరంలో నిలిచాం. చాలా అద్భుతంగా పనిచేశాం. జో.. మీ హయాంలో సైనికులకు సరైన ఆరోగ్య సౌకర్యాలు కలిగించని కారణంగా 3 లక్షల 80 వేల మంది సైనికులు మరణించారు. మీరు దాని గురించి మాత్రం మాట్లాడరు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఆర్థిక వ్యవస్థపై...

ట్రంప్‌ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని బైడెన్ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ట్రంప్‌నకు ఎలాంటి ప్రణాళిక లేదని అన్నారు. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం చేయూత అందించలేదని విమర్శించారు.

"అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తింది. మేం అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాం. ఉద్యోగ కల్పన చేపడతాం. ఆర్థిక వ్యవస్థను వారు కుప్పకూల్చారు. కొవిడ్ కంటే ముందు వారి చర్యల వల్ల తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింది."

-జో బైడెన్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి

బైడెన్ విమర్శలను ఖండించారు ట్రంప్. ఆర్థిక వ్యవస్థ పున:ప్రారంభం చాలా బలహీనంగా ఉందని అంగీకరించారు. 1929 నుంచి చూస్తే ఆర్థికవ్యవస్థ తిరిగి పుంజుకోవటంలో ప్రస్తుతం సమస్యలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. అయితే.. క్రమంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి బయట పడుతోందని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

అదే సమయంలో బైడెన్​పై విమర్శలు కురిపించారు ట్రంప్. అమెరికాను మూసేయాలని బైడెన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసేవరకు దేశాన్ని షట్‌డౌన్‌లో ఉంచాలన్నది వారి ఆలోచన అని ఆరోపించారు. వ్యవస్థలను తెరిచేందుకే తాము మొగ్గుచూపినట్లు చెప్పారు. తమ హయాంలో భారీగా ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పారు.

"తయారీ రంగంలో అమెరికాను తిరిగి అగ్రస్థానంలో నిలబెడతామని వారు చెప్తున్నారు. నేను ఏడు లక్షల ఉద్యోగాలు కల్పించా. వాళ్లేమీ చేయలేదు. తయారీ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. గతంలో పాలించిన వారికంటే మా పాలనే బాగుంది. మా హయాంలో జర్మనీ, జపాన్‌లకు చెందిన అనేక కార్ల తయారీ సంస్థలు మిచిగాన్‌లో పెట్టుబడులు పెట్టాయి."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వర్ణవివక్ష, నిరసనలపై...

జాతి వివక్ష విషయంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్​ వ్యక్తిగత విమర్శలకు దిగారు. తొలి ముఖాముఖి సంవాదంలో ఈ అంశంపై చర్చించగా.. అమెరికా చరిత్రలోనే ఇంత జాత్యంహకారం ఉన్న అధ్యక్షుడిని చూడలేదని బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ హయాంలోనే అంతరాలు, హింస పెరిగిందని మండిపడ్డారు. ఆఫ్రో అమెరికన్లు వ్యవస్థీకృత వివక్షకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతి వివక్ష అంశంలో మిమ్మల్ని ఎలా నమ్మాలని ట్రంప్​ను సూటిగా ప్రశ్నించారు బైడెన్​. అమెరికన్లంతా కలిసి ఈ దేశాన్ని నిర్మించుకున్నామని, మా విధానం ఎప్పటికీ జాతివివక్షకు వ్యతిరేకమేనని బైడెన్ స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడు కాగానే పౌరహక్కుల సంఘాలు, పోలీసులతో సమావేశమవుతానని తెలిపారు.

"విద్య, పని, చట్టాల అమలు విషయాల్లో నల్లజాతీయులపై దేశంలో వ్యవస్థీకృతమైన అసమానతలు చూపడం జరుగుతోంది. జార్జ్‌ ఫ్లాయిడ్‌, టేలర్‌ మరణాలపై పోలీసులు సంతోషంగా లేరు. ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్థించడం లేదు. ఈ తరహా ఘటనలకు పాల్పడ్డ వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టగలగాలి. ఆ విధమైన వ్యవస్థను తీసుకొస్తాను."

-జో బైడెన్‌, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి

బైడెన్ వ్యాఖ్యలపై ట్రంప్ ప్రతిదాడికి దిగారు. డెమొక్రాట్లు పాలిస్తున్న ప్రాంతాల్లోనే సమస్యలు ఎందుకొస్తున్నాయని, ఆఫ్రో అమెరికన్లను చిన్నచూపు చూసిన చరిత్ర ఎవరిదని ప్రశ్నించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే సమాజంలో ఎంతో అంతరం ఏర్పడిందని ఆరోపించారు. వర్ణవివక్ష ఉన్న విధానాలను సంస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

"ఆఫ్రో అమెరికన్‌లను 1994లో డెమొక్రాట్లు క్రూర మృగాలుగా పేర్కొన్నారు. వారిని అంత హీనంగా చూసిన చరిత్ర డెమొక్రటిక్‌ పార్టీది. నల్లజాతీయులు ఆ వ్యాఖ్యాలను ఎప్పటికీ మర్చిపోరు. మీరు ఆఫ్రోఅమెరికన్‌ సమాజాన్ని చాలాచెడ్డవాళ్లుగా చూశారు. డెమొక్రాట్లు అమెరికాను జాత్యంహకారంతో కూడిన దేశంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన రిపబ్లికన్ అధ్యక్షుల్లో నేను మాత్రమే చాలా బాగా పనిచేశాను."

-డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

పర్యావరణంపై...

పర్యావరణంపై ట్రంప్‌ అభిప్రాయాలు, ఆలోచనలు తప్పుగా ఉన్నాయని బైడెన్ విమర్శించారు. అమెరికా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు పురోగమించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2035 నాటికి ఇంధనరంగంలో కాలుష్య ఉద్గారాలను సున్నా స్థాయికి చేర్చాలని సంకల్పించారు. తాము అధికారంలోకి వస్తే తిరిగి పారిస్ ఒప్పందంలో చేరతామని పునరుద్ఘాటించారు.

"పర్యావరణ పరిరక్షణరీత్యా తప్పనిసరి పర్యావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఏం జరుగుతుందో కళ్లముందే చూస్తున్నాం. కొత్త హరిత విధానంలో భాగంగా కాలుష్యకారక కేంద్రాలను మూసివేస్తాం. మేం అధికారంలోకి వస్తే పారిస్ ఒప్పందంలో చేరతాం."

-జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి

అయితే, స్వచ్ఛమైన పర్యావరణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పారిస్‌ ఒప్పందం దారుణంగా ఉందని అన్నారు. సమర్థమైన అటవీ నిర్వహణ రావాలి అన్నదే తన ఉద్దేశమని, పర్యావరణం పేరిట వ్యాపారాలను దెబ్బ తీయొద్దని వ్యాఖ్యానింంచారు.

"పర్యావరణ పరిరక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. అటవీ విధానంపై బైడెన్‌ చెబుతున్న ప్రణాళికలు అమలు చేయాలంటే వంద లక్షల కోట్ల డాలర్లు కావాలి."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వ్యక్తిగత విమర్శలు

చర్చలో ట్రంప్‌, జో బైడెన్‌ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నారు. బైడెన్‌ ఉపాధ్యక్షుడయ్యేంత వరకు ఆయన కుమారుడికి ఉద్యోగం లేదని ట్రంప్‌ ఎద్దేవా చేశారు.

"మీరు ఉపాధ్యక్షుడయ్యేంత వరకూ మీ కుమారుడికి ఉద్యోగం లేదు. మీరు ఉపాధ్యక్షుడయ్యాక ఉక్రెయిన్‌, చైనా, మాస్కో వేరే ప్రాంతాల్లో ఆస్తి సంపాందించారు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన బైడెన్ తన కుమారుడిని సమర్థించుకున్నారు. తన కుమారుడు గొప్ప దేశభక్తుడని అన్నారు.

"నా కుమారుడు పరాజితుడు కాదు. గొప్ప దేశభక్తుడు. అతడి వెనక ప్రజలు ఉన్నారు. చాలామందిలాగే నా కుమారుడూ డ్రగ్ సమస్య ఎదుర్కొన్నాడు. దాన్ని అధిగమించి.... మంచివాడిగా మారాడు. నా కుమారుడ్ని చూసి నేను గర్విస్తున్నాను."

నిష్పాక్షిక ఎన్నికలపై

బ్యాలెట్‌ మోసాలకు తావు లేదని సంపూర్ణంగా నమ్ముతున్నామని బైడెన్ స్పష్టం చేశారు. ప్రజలను గందరగోళంలో పడేయడానికే ట్రంప్‌ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బ్యాలెట్ విధానంపై ఆయనకు ఉన్న అభ్యంతరాలన్నీ అపోహలేనని కొట్టిపారేశారు.

"నేను గెలిచినా, ఓడినా సంపూర్ణంగా అంగీకరిస్తాను. ఈ దేశం రానున్న రోజుల్లో ఎలా ఉండాలన్న నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. ఆ నిర్ణయాన్ని అందరు ఓట్ల రూపంలో తెలియజేయాలి."

బ్యాలెట్ విధానంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని విపత్తుగా అభివర్ణించారు. ఇందులో ఎన్నో లోటుపాట్లు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు.

"మాన్‌హాటన్‌, న్యూజెర్సీ వంటి నగరాల్లో ఏం జరిగిందో చూశాం. బ్యాలెట్‌ విధానాలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి. బ్యాలెట్‌ విధానంలో ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు నిజాయితీగా జరగాలి అన్నదే నా అభిప్రాయం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇలా గంటన్నర పాటు ఇరువురు అభ్యర్థుల మధ్య చర్చ జరిగింది. కరోనా సంక్షోభం, నల్లజాతీయుల నిరసనలు, ట్రంప్‌ పన్ను ఎగవేత, విదేశాంగ విధానం వంటి పలు ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ చర్చపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చలో భాగంగా ఇరువురు పరస్పరం వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. కొన్ని సందర్భాల్లో ఉభయులు సంయమనం కోల్పోయారు. 'నోరు మూసెయ్‌' అంటూ బైడెన్‌పై ట్రంప్‌ విరుచుకుపడగా.. 'మొరటువాడివి' అంటూ ట్రంప్‌పై బైడెన్‌ తన అసహనాన్ని ప్రదర్శించారు. ఇలా చర్చ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. పలు అంశాలపై ఇరువురి వైఖరేంటో వినే అవకాశం ప్రజలకు కలిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.