ETV Bharat / international

'సిరియా అధ్యక్షుడిని అప్పుడే లేపేద్దామనుకున్నా'

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్​ను చంపేందుకు 2017లో ఆదేశాలు ఇవ్వాలని అనుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే అప్పటి రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ తనను వద్దని వారించినట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Sep 16, 2020, 7:26 AM IST

us-president-trump-says-he-wanted-to-kill-syrias-assad-etv-bharat
'సిరియా అధ్యక్షుడిని అప్పుడే లేపేద్దామనుకున్నా'

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్​ను చంపడానికి 2017లోనే తాను ఆదేశాలివ్వాలనుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు. అయితే నాటి రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ తనను వారించారని పేర్కొన్నారు.

సొంత పౌరుల ఊచకోతకు, విదేశీయుల చిత్రవధకు ఆదేశాలివ్వడం వంటి యుద్ధ నేరాలకు అసద్ పాల్పడినట్లు ఆరోపించారు ట్రంప్. ఈ సందర్భంగా మ్యాటిస్​పైనా ట్రంప్ విమర్శలు చేశారు. విజయం ఎలా సాధించాలో ఆయనకు తెలియదన్నారు. మ్యాటిస్ వైదొలిగాక ఉగ్రవాదంపై పోరులో తాము ఎంతో పురోగతి సాధించినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.