ETV Bharat / international

ఆ దేశాలపై ఆంక్షలు కొనసాగించనున్న అమెరికా - visa sanction

ఈ ఏడాది ఏప్రిల్​లో పలు దేశాలపై విధించిన వీసా ఆంక్షలు కొనసాగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

us visa sanctions, వీసా ఆంక్షలు
'ఆంక్షలు కొనసాగిస్తా'
author img

By

Published : Dec 31, 2020, 9:50 AM IST

పలు దేశాలపై ఆమెరికా విధించిన వీసా ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న'.. డిసెంబరు 31 వరకు వీసా ఆంక్షలు విధిస్తున్నామని ట్రంప్ మెమోరాండం విడుదల చేశారు.

మెమోరాండంలో పేర్కొన్న విధంగానే ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాల వరకు అందులో ఎలాంటి మార్పులు ఉండవని అన్నారు.

ఆంక్షలు ఇందుకే..

కరోనా పరిస్థితుల కారణంగా అమెరికాలో ఉన్న విదేశీయులను తమ దేశాలకు చేరుకునేలా సంబంధిత దేశాలు చర్యలు చేపట్టాలని అగ్రరాజ్యం కోరింది. అయితే దీనిపై పలు దేశాలు విముఖత చూపాయి. ఈ వైఖరి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దేశాలపై వీసా ఆంక్షలు విధించారు. ఈ మేరకు చర్యలు చేపట్టని దేశాలపై ఆంక్షలు విధించాలంటూ హోంశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి : సీలింగ్​ ఫ్యాన్లతో ముప్పు- 2 లక్షల యూనిట్లు రీకాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.