ETV Bharat / international

'బైడెన్​' దాతల లిస్ట్​లో ఆ పేర్లు ఎందుకు లేవు?

లక్ష డాలర్లు, ఆపైన విరాళాలు అందించిన దాతల జాబితాను డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ విడుదల చేశారు. ఇందులో భారతీయ అమెరికన్లు కూడా ఉన్నారు. అయితే, మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్ క్లింటన్​కు విరాళాలు అందించిన భారతీయ అమెరికన్లు కొంతమంది బైడెన్​ విషయంలో మారిపోయినట్లు తెలుస్తోంది.

US-BIDEN-FUNDRAISERS
బైడెన్
author img

By

Published : Nov 2, 2020, 1:04 PM IST

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. తనకు విరాళాలు అందజేసినవారి జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఈ ఏడాది తన ప్రచారం కోసం కనీసంగా లక్ష డాలర్ల వరకు అందజేసిన దాతల పేర్లను వెల్లడించారు. ఈ జాబితాలో మొత్తం 800 మంది ఉండగా.. అందులో భారతీయ అమెరికన్లు కూడా పలువురు ఉన్నారు.

స్వదేశ్ ఛటర్జీ, రమేశ్ కపూర్, శేఖర్ నరసింహన్, రంగస్వామి, అజయ్ భూటోరియా, ఫ్రాంక్ ఇస్లాం తదితరులు బైడెన్​కు నిధులు సమకూర్చిన వాళ్లలో ముఖ్యులు. అయితే, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్​కు విరాళాలు అందించిన వాళ్లలో చాలామంది బైడెన్​ విషయంలో మారిపోయారు. డెమొక్రాట్లకు ప్రతిసారి నిధులు సమకూర్చే సంత్​ ఛట్​వాల్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో లేరు.

నేతలు, హాలీవుడ్ ప్రముఖులు..

బైడెన్​కు నిధులు సమకూర్చిన వాళ్లలో ప్రస్తుత, మాజీ గవర్నర్లు, సెనేటర్లు, మంత్రులతో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని వాల్​స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సినీ నిర్మాత జెఫ్రీ కాటెన్​బర్గ్, దర్శకుడు లీ డేనియల్స్, లింక్​డ్ఇన్​ సహా వ్యవస్థాపకులు రీడ్ హాఫ్​మన్, మీడియా మొఘల్ హైమ్ సబన్, మాజీ వాణిజ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్​కర్ ఉన్నట్లు తెలిపింది.

నిధుల సేకరణలో రికార్డు..

అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల్లో బిలియన్‌ డాలర్ల విరాళాలను సేకరించిన మొదటి అభ్యర్థిగా బైడెన్‌ నిలవనున్నారు. అక్టోబర్ 14 వరకు బైడెన్​ 93.8 కోట్ల డాలర్లు సేకరించగా.. అధ్యక్షుడు ట్రంప్​కు 59.6 కోట్ల డాలర్లు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లోనే బైడెన్​ 70 కోట్ల డాలర్లు సేకరించారు.

ఇదీ చూడండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.