ETV Bharat / international

బార్​లో గొడవ- 8 మందిని కత్తితో పొడిచిన దుండగుడు - ఎనిమిది మందిపై కత్తితో దాడి

బార్​లో తలెత్తిన ఓ గొడవలో ఎనిమిది మందిని కత్తితో పొడిచాడో దుండగుడు. అప్రమత్తమైన స్థానిక అధికారులు.. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అమెరికాలో ఈ ఘటన జరిగింది.

Police: Man stabs 8 during fight at Detroit hookah bar
బార్​లో గొడవ- ఎనిమిది మందిని కత్తితో పొడిచిన దుండగుడు
author img

By

Published : Mar 22, 2021, 5:51 AM IST

అమెరికాలో డెట్రాయిట్​ హుక్కా బార్​లో ఓ దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన గొడవలో ఆ వ్యక్తి.. ఏకంగా ఎనిమిది మందిని కత్తితో పొడిచాడు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ జరిగింది..

ఆదివారం తెల్లవారుజామున 4:40 గంటల ప్రాంతంలో.. టియాగ హుక్కా లాంజ్​లో 34 ఏళ్ల వ్యక్తి పార్కింగ్​ స్థలంలోకి వెళ్లే క్రమంలో గొడవ ప్రారంభమైందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అయితే.. ఈ ఘటనలో తొలుత అక్కడ కాల్పులు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత.. కత్తిపోట్లు చోటుచేసుకున్నట్లు వివరించారు.

ఈ ఘర్షణలో నిందితుడు కూడా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: నిబంధనల ఉల్లంఘనులపై తూటాల వర్షం- ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.