ETV Bharat / international

అమెరిక్లనకు ఉచిత వ్యాక్సిన్- పంపిణీ​ కోసం భారీ ప్రణాళిక! - vaccination campaign

అమెరికా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ అందించేందుకు భారీ ప్రణాళిక రచించింది ఫెడరల్​ ప్రభుత్వం. కాంగ్రెస్​తోపాటు రాష్ట్రాలు, స్థానిక ఏజెన్సీలకు నివేదిక సమర్పించింది. గతంలో కంటే ఈసారి వ్యాక్సిన్​ పంపిణీ సంక్లిష్టంగా ఉండనుందని అంచనా వేసింది. రెండు, మూడో దశల్లో దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

US outlines plan to provide free COVID-19 vaccine
అమెరిక్లనకు ఉచిత వ్యాక్సిన్
author img

By

Published : Sep 16, 2020, 10:26 PM IST

వ్యాక్సిన్ భద్రతపై అమెరికా ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. టీకా పంపిణీ చర్యలను వేగవంతం చేస్తోంది అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం. తమ దేశ పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్​ అందించేందుకు భారీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు కాంగ్రెస్​, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు నివేదిక సమర్పించింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో టీకా పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరికీ దానిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించాయి ఫెడరల్​ హెల్త్​ ఏజెన్సీలు, రక్షణ శాఖ.

వ్యాక్సిన్​ పంపిణీలో పెంటగాన్​ పాలుపంచుకోనుంది. కానీ, ఆరోగ్య శాఖ కార్యకర్తలే టీకాలు వేయనున్నారు. సీజనల్​ వ్యాధులు, గతంలో మహమ్మారుల సమయంలో వ్యాక్సిన్లు వేసిన దానికంటే ఈసారి వ్యాక్సిన్​ పంపిణీ సంక్లిష్టంగా ఉండనుందని అంచనా వేశారు అధికారులు.

ప్రణాళికలోని ముఖ్యాంశాలు..

  • టీకాలు వివిధ ఔషధ సంస్థల నుంచి అందుబాటులోకి రావచ్చు. అయితే.. చాలా మందికి 21 నుంచి 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదులు అవసరం. డబుల్​ డోస్​ టీకాలు ఒకే ఔషధ తయారీదారు నుంచి రావాల్సి ఉంటుంది.
  • అమెరికా జనాభాకు టీకాలు వేయటం చిన్న విషయం కాదు, ఒక మారథాన్​. ప్రారంభంలో చాలా తక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లు సరఫరా కావచ్చు. ప్రధానంగా ఆరోగ్య సిబ్బంది, ఇతర కీలక ఉద్యోగులు, తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలిదశలో ఎవరికి ఇవ్వాలన్న అంశంపై నేషనల్​ అకాడమీ ఆఫ్​ మెడిసిన్​ పనిచేస్తోంది. రెండు, మూడో దశలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్​ సరఫరా ఉంటుంది.
  • వ్యాక్సిన్​ పూర్తిగా ఉచితం. రోగుల నుంచి ఒక్క పైసా వసూలు చేయరు.
  • రాష్ట్రాలు, స్థానిక విభాగాలు వ్యాక్సిన్​ పొందటం, వాటిని పంపిణీ చేసేందుకు తగిన విధంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందులో టీకా రిఫ్రిజిరేషన్​, ఫ్రీజింగ్​ సౌకర్యాల వంటివి అవసరం. రాష్ట్రాలు, నగరాలకు తమ ప్రణాళికను సమర్పించేందుకు నెలరోజుల సమయం ఉంది.

క్లినికల్​ ట్రయల్స్​ తుది దశలో ఉన్న వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కోసం ఎఫ్​డీఏ అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. వెంటనే లక్షల డోస్​లను ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్​ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది.

అయితే.. వ్యాక్సినేషన్​పై ప్రజల నుంచి సందేహాలు తలెత్తుతున్నాయి. అసోసియేటెడ్​ ప్రెస్​ గత మే నెలలో చేపట్టిన సర్వేలో సగం మంది అమెరికన్లు మాత్రమే వ్యాక్సిన్​ వస్తుందని తెలిపారు. చాలా మంది వ్యాక్సిన్​ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ తిరిగి ఎన్నికయ్యేందుకు ప్రభుత్వం కరోనా చికిత్సలు, వ్యాక్సిన్లను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: నెలలోపే అమెరికాకు వ్యాక్సిన్‌: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.