ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓ నుంచి అమెరికా వైదొలిగేది అప్పుడే..!

author img

By

Published : Jul 8, 2020, 5:00 AM IST

Updated : Jul 8, 2020, 6:03 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్​కు అమెరికా అధికారికంగా తెలియజేసింది. వచ్చే ఏడాది జులై 6 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రక్రియకు సంబంధించి డబ్ల్యూహెచ్​ఓ షరతులపై గుటెర్రస్​ పరిశీలిస్తున్నట్లు.. ఆయన కార్యాలయం వెల్లడించింది.

US-WHO-WITHDRAWAL
డబ్ల్యుహెచ్​ఓ నుంచి అమెరికా ఉపసంహరణ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) నుంచి వైదొలుగుతున్నామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్​కు ట్రంప్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ నిర్ణయం 2021 జులై 6 నుంచి అమల్లోకి రానుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

అమెరికా ఉపసంహరణకు సంబంధించి డబ్ల్యూహెచ్​ఓ నిబంధనలను గుటెర్రస్​ పరిశీలిస్తున్నట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ తెలిపారు. డబ్ల్యూహెచ్​ఓ షరతులకు అనుగుణంగా అమెరికా ప్రకటన ఉందా అనే విషయాన్ని ధ్రువీకరించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.

వైదొలగాలంటే ఎలా..

డబ్ల్యూహెచ్​ఓ ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. వైదొలిగే ఏడాది ముందు ఐరాసకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఉపసంహరణకు ముందే డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా ఇచ్చిన ఆర్థిక హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.

డబ్ల్యూహెచ్​ఓకు 400 మిలియన్​ డాలర్లతో అతిపెద్ద స్పాన్సర్​గా ఉన్న అమెరికా.. ఇంకా 230 మిలియన్ డాలర్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు 2020-21 కాలంలో స్వచ్ఛందంగా అందిస్తామన్న 650 మిలియన్ డాలర్ల హామీని నెరవేర్చాల్సి ఉంటుంది.

డబ్ల్యూహెచ్​ఓకు బైడెన్ మద్దతు..

ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ నిర్ణయాన్ని మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తప్పుబట్టారు. డబ్ల్యూహెచ్​ఓకు పూర్తి మద్దతిస్తామని వెల్లడించారు. నవంబర్​లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటామని తెలిపారు.

కరోనా వైఫల్యంతోనే..

కరోనా మహమ్మారి విషయంలో మొదటి నుంచి డబ్ల్యూహెచ్​ఓపై విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని మే నెలలో ప్రకటించారు. డబ్ల్యూహెచ్​ఓతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్​ఓ పూర్తిగా విఫలమైనందు వల్లే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, చైనా చేతిలో సంస్థ కీలుబొమ్మలా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు​ ట్రంప్. చైనాలో మహమ్మారి విజృంభిస్తుందని తెలిసినా ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్​ఓ అప్రమత్తం చేయలేకపోయిందన్నారు.

ఇదీ చూడండి: అమెరికా-డబ్ల్యూహెచ్​ఓ మధ్య అసలేం జరిగింది?

Last Updated : Jul 8, 2020, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.