ETV Bharat / opinion

అమెరికా-డబ్ల్యూహెచ్​ఓ మధ్య అసలేం జరిగింది? - Whats happening between US and WHO

కరోనా వైరస్​ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ), అగ్రరాజ్యం అమెరికాకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కొవిడ్-19 విషయంలో డబ్ల్యూహెచ్​ఓ చైనాకు మద్దతుగా నడుచుకుంటోందని ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అంతేకాదు ఆ సంస్థకు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్లూ ప్రకటించారు. ఈ ఒక్కటే కాదు గతంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.

Whats happening between US and WHO
అమెరికా-డబ్ల్యూహెచ్​ఓ మధ్య అసలేం జరుగుతోంది?
author img

By

Published : Jun 2, 2020, 7:46 PM IST

"ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్ఓతో ఉన్న సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నాం. ఆ నిధులను ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అవసరాలకు మళ్లిస్తున్నాం." మే 29న శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్న మాటలివి. అంతేకాదు రాబోయే 30 రోజుల్లో గణనీయమైన సంస్కరణలు తేవడానికి కట్టుబడి ఉండాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్​కు ట్రంప్ లేఖ కూడా రాశారు.

అమెరికా తన దేశీయ ప్రాధాన్యాలను ఏకపక్షంగా అనుసరించడానికి బహుపాక్షిక సహకారాన్ని పక్కకు పెట్టాలనే నిర్ణయం ఇప్పటివరకు అమెరికా పాలనా వ్యవస్థలో అనేక సందర్భాల్లో కనిపిస్తూనే ఉంది.

యునెస్కో నుంచి ఔట్​

2017 అక్టోబర్​లో ఐక్యరాజ్యసమితి విద్య, సామాజిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) సభ్యత్వం నుంచి అమెరికా వైదొలిగింది. ప్రసిద్ధ అమెరికన్ రచయిత, యునెస్కో మొట్టమొదటి పాలక మండలి సభ్యుడు ఆర్కిబాల్డ్ మాక్లీష్, యునెస్కో రాజ్యాంగానికి ముందుమాట రాస్తూ, "యుద్ధాలు మనుషుల మనస్సులలో మొదలవుతాయి కాబట్టి, శాంతి సౌధం నిర్మాణం కూడా మనుషుల మనస్సులలోనే ప్రేరేపించాలి" అని పేర్కొన్నారు. యునెస్కో వద్ద బకాయిలు పెరగడం, సంస్థ‌లో ప్రాథమిక సంస్కరణల ఆవశ్యకత, యునెస్కోలో ఇజ్రాయెల్ వ్యతిరేక పక్షపాత వైఖరి కొనసాగించడం వంటి ఆరోపణలతో అమెరికా యునెస్కో నుంచి బయటకు వచ్చింది.

యూఎన్​హెచ్​ఆర్సీ నుంచి...

2005 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి 60వ వార్షికోత్సవ శిఖరాగ్ర సదస్సులో ఏకగ్రీవంగా ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్​హెచ్ఆర్సీ) నుంచి అమెరికా 2018 జూన్​లో వైదొలిగింది. అయితే, యూఎన్​హెచ్ఆర్సీ ఏర్పాటుపై 2006 మే నెలలో అమెరికా యూఎన్ సమావేశంలో (ఇజ్రాయెల్, పలావో, మార్షల్ దీవులతో సహా) వ్యతిరేక ఓటు వేసింది. ఎందుకంటే ఏ దేశాలైతే మానవ హక్కులను దుర్వినియోగం చేసే హేయమైన చర్యలకు ఒడిగడుతున్నాయని తాను భావిస్తుందో, ఆ దేశాలకు యూఎన్​హెచ్ఆర్సీలో స్థానం కల్పించడాన్ని అమెరికా వ్యతిరేకించింది. 2006-2009 మధ్యకాలంలో, "పాలస్తీనా, ఇతర ఆక్రమిత అరబ్ భూభాగాలలో మానవ హక్కుల పరిస్థితుల"పై అజెండా 7తో సహా యూఎన్​హెచ్ఆర్సీ తన విధి విధానాలను రూపొందించింది. 2006లో యూఎన్​హెచ్ఆర్సీకి జరిగిన ఎన్నికలలో పోటీ చేయకపోవడం ద్వారా, ఇజ్రాయెల్‌కు సంబంధించిన సమస్యలపై చర్చలు జరిపినప్పుడు ప్రారంభంలోనే అమెరికా హాజరుకాలేదు. అందువల్ల, యూఎన్​హెచ్ఆర్సీ అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక దీర్ఘకాలిక పక్షపాతాన్నే ట్రంప్ ప్రధాన కారణంగా చూపుతూ 2017-2019 కాలానికి ఎన్నికైన 47 మంది సభ్యుల కార్యవర్గం నుంచి బయటకు వచ్చారు.

డబ్ల్యూహెచ్ఓ విషయానికొస్తే, 193 దేశాల సభ్యత్వం గల ఈ సంస్థ నుంచి బయటకు రావాలని నిర్ణయించడానికి ముందు ట్రంప్​ ఎలాంటి విశేషమైన సంస్కరణలను ఆశించారో స్పష్టత లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా చైనా చెప్పుచేతల్లో ఉందని అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగంలో దుమ్మెత్తి పోశారు. చైనా అధికారులే మొదట వైరస్​ను కనుగొంటే, దాని నుంచి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టేలా డబ్ల్యూహెచ్ఓపై చైనా ఒత్తిడి తెచ్చిందని ట్రంప్ ఆరోపించారు. మరో వైపు, 2020 జనవరి 24న డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తూ కరోనా వైరస్​ను నిలువరించడానికి చైనా చాలా కష్టపడి పని చేస్తోందని అన్నారు. అలాగే చైనా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నట్టు కనిపిస్తోందని ఫిబ్రవరి 29న మీడియా సమావేశంలోనూ వ్యాఖ్యానించారు.

2019 డిసెంబర్ 31న వుహాన్‌లో మొదటి క్లస్టర్ నిమోనియా కేసులను చైనా నివేదించిన ఒక రోజు తర్వాత, ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి చైనాకు సాయమందించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

రెండు షరతులు

డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే 1948లో ఈ సంస్థలో చేరిన అమెరికా రెండు షరతులకు కట్టుబడి ఉండాలి. అందులో మొదటిది... ఒక సంవత్సరం నోటీసు ఇవ్వాలి. రెండోది, ప్రస్తుత ఆర్థిక చక్రంలో డబ్ల్యూహెచ్ఓకిచ్చిన ఆర్థిక హామీలు నెరవేర్చాలి.

"ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అందించే నిధులను ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు అర్హులైన, అత్యవసరమైన, ప్రపంచ ప్రజారోగ్య అవసరాలకు మళ్లిస్తాము" అని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినప్పటికీ, అమెరికా అధికారికంగా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన తరువాతే ఇది సాధ్యమవుతుంది.

డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం, 236.9 మిలియన్ల డాలర్ల సాయంతో పాటు, 2020-21 మధ్యకాలంలో 656 మిలియన్ డాలర్ల స్వచ్ఛందంగా అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. డబ్ల్యూహెచ్ఓ వార్షిక నిర్వహణ బడ్జెట్‌కు ఇప్పటివరకు ఇదే అతిపెద్ద సహాయం (సుమారు 22శాతం). ఈ సహాయంలో ప్రధానంగా పోలియో నిర్మూలన (27.4శాతం)కు ఖర్చు చేస్తారు, తరువాత ఆరోగ్య, పోషక సేవలకు(17.4శాతం), వ్యాక్సిన్-నివారించగల వ్యాధులు (7.7శాతం), క్షయవ్యాధి 5.74 శాతం అందుతుంది..

డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలగడం.. ఆ సంస్థలోని ఇతర సభ్యులకు ప్రపంచ ఆరోగ్య సమస్యలపై అంతర్జాతీయ సహకారాన్ని కొనసాగించడంలో ముందడుగు వేయడానికి అవకాశం కల్పిస్తుంది. కొవిడ్-19ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీపై ఇపుడు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇటీవల జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఏ) సమావేశంలో, ఐరోపా సమాఖ్య, చైనా ఇలాంటి పాత్రనే ప్రతిపాదించాయి.

ఆర్థిక సహాయం ఉపసంహరణ

కొవిడ్-19ను ఎదుర్కోవటానికి మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా డబ్ల్యూహెచ్ఏ సమావేశంలో చర్యలు చేపడతారు. ఏదైనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండడానికి పారదర్శక, సమాన, సకాల చర్యలు పాటించాలని అసెంబ్లీలో అభిప్రాయానికి వచ్చారు.

డబ్ల్యూహెచ్ఓ సమన్వయంతో కూడిన ప్రపంచ ఆరోగ్య కార్యకలాపాలకు అమెరికా ఆర్థిక సహాయ ఉపసంహరణ, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మే 29న ప్రకటనకు ముందే, కొవిడ్-19, పోలియోను ఎదుర్కోవటానికి ప్రజారోగ్య కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి అమెరికా 7 దేశాలను తన ప్రాధాన్యంగా గుర్తించింది. అఫ్గానిస్థాన్, ఈజిప్టు, లిబియా, పాకిస్థాన్, సిరియా, సుడాన్, టర్కీ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

భారతదేశంలో కొవిడ్-19ను ఎదుర్కోవటానికి తెలియని సవాళ్లు ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ, యూఎన్​తో బలమైన సంబంధాలు అవసరం. రెండు దశాబ్దాల క్రితం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ సంక్షోభాన్ని తగ్గించడంలో ఇటువంటి అంతర్జాతీయ సహకార ప్రభావం భారతదేశానికి స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో, ఒక భారతీయ ఔషధ సంస్థ (సిప్లా) హెచ్ఐవీ/ఎయిడ్స్ వైరస్​ను ఎదుర్కోవటానికి సరసమైన ధరల్లో ఔషధాలను ఉపయోగించడానికి అనుమతి పొందింది.

భారత్​కు ఎంతో కీలకం

డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడిగా భారత ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టడం మనకు కలిసొచ్చే అంశం. దేశంలో కొవిడ్-19ను ఎదుర్కోడానికి తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయ సహకారం భారత్​కు ఎంతో అవసరం. అంతేకాదు భారత్​- డబ్ల్యూహెచ్ఓ మధ్య ఎంతో కాలంగా సంప్రదాయంగా వస్తున్న సంబంధాలను ఇది మరింత మెరుగుపరుస్తుంది. భారత్​లో ప్రధాన కేంద్రంగా ఉన్న డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ కేంద్రం డాక్టర్ పూనమ్ ఖేతర్పల్ సింగ్ నేతృత్వంలో పనిచేస్తోంది. సుమారు 1600 మంది నిపుణులు దీనిలో పని చేస్తున్నారు. ఈ కేంద్రంతో కూడా భారత్ సంబంధాలు ఎంతో ముఖ్యం.

- అశోక్ ముఖర్జీ, ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.