భద్రతా సహకారం, రక్షణ పరికరాల కోసం రష్యాతో భారత్‌కు సుదీర్ఘ బంధం ఉందనే విషయాన్ని అమెరికా అర్థం చేసుకోవాలన్నారు ఆ దేశ నౌకాదళాధిపతి జాన్ ఆక్విలినో. అయితే ప్రధాన ఆయుధాల కోసం రష్యా నుంచి మళ్లేలా భారత్‌ను ప్రోత్సాహిస్తానని చెప్పారు. లేదంటే ఆంక్షలు విధించే అవకాశమూ లేకపోలేదన్నారు. రష్యా నుంచి భారత్ ఎస్-400 ఆయుధ వ్యవస్థ కొనుగోలు చేయడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
"రష్యా నుంచి ఎస్-400 క్షిపణి కొనుగోలు చేస్తే భారత్‌పై ఆంక్షలు విధించాలా? అనే అంశాన్ని చట్టసభలు తేల్చుతాయి. రక్షణ సహకారం, పరికరాల కోసం రష్యాతో భారత్‌కు సుదీర్ఘ బంధం ఉందనే విషయం మాకు తెలుసు. అయితే ఆయుధాల కోసం భారత్‌కు ప్రత్యామ్నాయాలను అందించడం మంచి విధానం అని భావిస్తున్నా. అమెరికా సైనిక పరికరాలను కొనేలా ఆ దేశాన్ని ప్రోత్సహిస్తాం."
- జాన్ ఆక్విలినో, అమెరికా నౌకాదళాధిపతి
ఇండో పసిఫిక్ కమాండ్‌కు తర్వాతి కమాండర్‌గా జాన్ ఆక్విలినో వ్యవహరించనున్నారు. భారత్ తమకెంతో విలువైన భాగస్వామి అని, ఇకపై భారత్ సహా క్వాడ్‌లోని మిగిలిన దేశాలకు ప్రధాన్యత పెరుగుతుందని జాన్ చెప్పారు.
ఇదీ చూడండి: అంతా అమెరికానే చేసింది: రష్యా