ETV Bharat / international

అమెరికా నౌకాదళ తొలి మహిళా అధికారికి గౌరవం - యూఎస్​ఎస్​ కాన్​స్టిట్యూట్​లో పర్ఫెక్టస్​ తుపాకీ

అగ్రరాజ్య నేవీ విభాగంలో తొలి మహిళా అధికారికి అరుదైన గౌరవం లభించింది. 1917 మార్చి 21న చీఫ్​ పెట్టీ ఆఫీసర్​గా ఆమె నియామకం కాగా.. యూఎస్​ఎస్​ కాన్​స్టిట్యూషన్​ యుద్ధనౌకలోని ఓ భారీ ఆయుధానికి ఆమె పేరు పెట్టింది అమెరికా.

US Navy Honor to the first woman, Who appointed as Chief petty officer
అమెరికా నౌకాదళ తొలి మహిళా అధికారికి గౌరవం
author img

By

Published : Mar 23, 2021, 6:51 AM IST

అమెరికా నౌకాదళంలో చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌గా నియమితులైన తొలి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌ఎస్‌ కాన్‌స్టిట్యూషన్‌ అనే యుద్ధనౌకలోని ఒక భారీ తుపాకీకి ఆమె పేరును పెడుతున్నట్లు నేవీ పేర్కొంది. లొరెట్టా పర్ఫెక్టస్‌ వాల్ష్‌ పేరిట 'ఫర్ఫెక్టస్‌' అని ఆ ఆయుధానికి నామకరణం చేసింది. ఆమె.. 1917 మార్చి 21న నౌకాదళ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 'మహిళా మాసాన్ని' పురస్కరించుకొని సోమవారం బోస్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పేరును ఖరారు చేశారు.

యూఎస్‌ఎస్‌ కాన్‌స్టిట్యూషన్‌.. ప్రపంచంలోనే అత్యంత పురాతన యుద్ధనౌక. 1797 నుంచి 1855 వరకూ అది సేవలు అందించింది. ఇప్పటికీ సముద్రయానం చేసే స్థితిలో ఉంది. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఈ నౌక.. ఓటమి ఎరుగదు.

ఇదీ చదవండి: బైడెన్​ సర్కార్​కు 'వలస' తలనొప్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.