నాసా శాస్త్రవేత్తలు భూమిని పోలిన మరో భూమిని కనిపెట్టారు. నిజ్జంగా ఇది నిజం. భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి 'జీజే 357 డీ' అనే నామకరణం చేశారు. దీన్ని నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే ఉపగ్రహం(టెస్) టెలీస్కోప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించింది.
సూర్యుడిలో మూడో వంతు పరిమాణంలో ఉండే ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ జీజే 357 డీ గ్రహంతో పాటు మరో రెండు గ్రహాలు తిరుగుతున్నాయి. భూమితో పోలిస్తే జీజే 357 డీ ద్రవ్యరాశి ఎక్కువ కాగా.. దీన్ని సూపర్ ఎర్త్‌గా పరిగణిస్తున్నారు.
ఈ గ్రహంపై వాతావరణం చాలా బావుందని.. భూమిలాగే అక్కడ ద్రవరూప నీరు ఉండేందుకు అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. త్వరలో అందుబాటులోకి వచ్చే అత్యాధునిక టెలిస్కోపులతో ఈ గ్రహంపై జీవం ఉనికిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
"విశ్వాన్ని పూర్తిగా జల్లెడపట్టి అందులోని .. నక్షత్రాలు, వాటి చుట్టూ కక్ష్యల్లో తిరిగే ‘ఎక్సో ప్లానెట్స్‌ని’ వెతికిపట్టే లక్ష్యంతోనే టెస్ టెలిస్కోప్ని తయారుచేశారు."
-ప్యాడి బోయిద్, ఎక్సోప్లానెట్ ఎండ్ స్టెల్లర్ ఆస్ర్టోఫిసిక్స్ ల్యాబ్ ఛీఫ్
భూమికి ఒకటి లేదా రెండు రెట్లు...
భూమికి ఒకటి లేదా రెండు రెట్లు ఆ గ్రహం ఉంటుందని అంచనా. మన నుంచి 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. యాస్ర్టోఫిసిక్స్ ఆఫ్ కెనరి ఐలాండ్ విశ్వవిద్యాలయానికి (IAC) చెందిన శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
"ఈ గ్రహం తన మాతృ నక్షత్రానికి అత్యంత దూరంలో ఉంది. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ 55.7 రోజులకు మాతృ నక్షత్రాన్ని చుట్టేస్తోంది. అందువల్ల ఈ గ్రహంలో ఒక సంవత్సరమంటే 55.7 రోజులు మాత్రమే.