ETV Bharat / international

'వ్యాక్సిన్​ తయారీలో వేగంగా ముందుకెళుతున్నాం' - vaccine us making

కరోనా వైరస్​ను కట్టడి చేసే దిశగా అమెరికా ఎంతో పురోగతి సాధించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో చాలా వేగంగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు.

vaccine
'వ్యాక్సిన్​ తయారీలో వేగంగా ముందుకెళుతున్నాం'
author img

By

Published : Jun 16, 2020, 11:24 AM IST

కరోనా వైరస్ తయారీలో అమెరికా చాలా ముందడుగు వేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కరోనాపై పోరులో ఎంతో పురోగతి సాధించామని, చికిత్స విధానంలోనూ కీలక దశల్లో ఉన్నట్లు తెలిపారు.

"వ్యాక్సిన్​ తయారీకి సంబంధించి ఒక శుభవార్త ఉంది. వ్యాక్సిన్​ తయారీలో చాలా వేగంగా ముందుకు సాగుతున్నాం. చికిత్సకు సంబంధించి కూడా ఎంతో పురోగతి సాధించాం. నేను ఫలితాలు చూశాను. పరిశోధకులతో కలిసి మాట్లాడాను. వాళ్లు చాలా తెలివైనవాళ్లు. ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిన గొప్పవాళ్లు. చైనా ఇది జరగకూడదని భావించింది. కానీ మేం సాధిస్తున్నాం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

చాలా ప్రాంతాల్లో వ్యాధి అదుపులోకి వస్తోందని ట్రంప్ తెలిపారు. వైరస్​ను అర్థం చేసుకున్నామని, న్యూజెర్సీలో మరణించిన 12 వేల 500 మందిలో 18 ఏళ్లలోపు వ్యక్తి ఒక్కరే ఉన్నారని వెల్లడించారు.

వీఓఏ డైరెక్టర్​ రాజీనామా..

అగ్రరాజ్యం అధీనంలోని వాయిస్ ఆఫ్​ అమెరికా సంస్థ డైరెక్టర్​, డిప్యూటీ డైరెక్టర్​ రాజీనామా చేశారు. సంస్థ స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ట్రంప్ ప్రభుత్వంతో స్పర్థల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంస్థను వీడుతున్నట్లు డైరెక్టర్​ అమందా బెన్నెత్, డిప్యూటీ డైరెక్టర్​ సాండీ సుగవరా ప్రకటించారు. వాయిస్​ ఆఫ్​ అమెరికాను పర్యవేక్షించే సంస్థపై ట్రంప్ మిత్రుడు మైకేల్​ ప్యాక్​ ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యం, విదేశాల్లో అమెరికా విలువలకు సంబంధించి ఈ సంస్థ కృషిచేస్తోంది. అయితే వీఓఏ జర్నలిస్టులకు సహకరించకూడదని ఇటీవల వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలకు ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చూడండి: ఈ-కామర్స్‌ ప్రపంచాన్ని 'ఫ్లిప్' చేసి 'కార్టు'లో వేసిన ఆలోచన...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.