ETV Bharat / international

ట్రంప్ టిక్​టాక్ బ్యాన్​ యత్నాలకు బ్రేక్!

పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతా కారణాలతో టిక్​టాక్​ను అమెరికాలో నిషేధించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకుండా అమెరికా ఫెడరల్ జడ్జ్ స్టే విధించారు.

author img

By

Published : Dec 8, 2020, 10:11 AM IST

Trump restrictions on TikTok
టిక్​టాక్​ బ్యాన్​కు అడ్డుకట్ట

అమెరికాలో 'టిక్​టాక్​'ను నిషేధించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగాన్ని యూఎస్​ ఫెడరల్ జడ్జ్ నిలుపుదల​ చేశారు. టిక్​టాక్ విషయంలో ప్రభుత్వం తమ అధికారాలను మీరి నిర్ణయాలు తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు.

టిక్​టాక్ ద్వారా చైనా ప్రభుత్వం తమ పౌరుల డేటాను చోరీ చేస్తోందనే ఆరోపణలతో.. ఆ యాప్​ బ్యాన్​ చేస్తామని ట్రంప్ ఆగస్టులో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించిన కోర్టులో కేసు నడుస్తున్న కారణంగా నిషేధం అమలులోకి రాలేదు. ఆ తర్వాత కూడా టిక్​టాక్​ను అమెరికా సంస్థకు విక్రయించే ఆఫర్ ఇచ్చిన ట్రంప్ యంత్రాంగం.. నిషేధాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

ఇదీ చూడండి:అంతరిక్ష కేంద్రానికి క్రిస్మస్​ బహుమతులు​ పంపిన స్పేస్​ఎక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.