ETV Bharat / international

ఉత్తర కొరియాపై ఆ మూడు దేశాల కీలక నిర్ణయం

అణ్వాయుధాల విషయంలో ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు సహకారాన్ని కొనసాగించాలని అమెరికా, జపాన్​, దక్షిణ కొరియా నిర్ణయించాయి. ఈ మేరకు మూడు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య జరిగిన భేటీలో అంగీకారం కుదిరింది.

Denuclearize North Korea
ఉత్తర కొరియాపై ఆ మూడు దేశాల కీలక నిర్ణయం
author img

By

Published : Apr 3, 2021, 10:47 AM IST

ఉత్తర కొరియా అణు కార్యకలాపాలను కట్టడి చేసేందుకు త్రైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉండాలని అమెరికా, జపాన్​, దక్షిణ కొరియా నిర్ణయించాయి. ఈ మేరకు మూడు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు.. ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు శ్వేతసౌధం తెలిపింది.

"ఉత్తర కొరియా అణు పరీక్షలు, బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగాల గురించి మూడు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. పరస్పర సహకారంతో వీటిని కట్టడి చేయాలని నిర్ణయించాయి."

-శ్వేతసౌధం ప్రకటన

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్​ఎస్​ఏ) జాక్​ సులివాన్​, జపాన్ జాతీయ భద్రత చీఫ్​​ షిగేరు కితామురా, దక్షిణ కొరియా జాతీయ భద్రతా కార్యాలయం డైరెక్టర్​ సూ హూన్​.. శుక్రవారం వాషింగ్టన్​లో భేటీ అయ్యారు. అయితే.. ఉత్తర కొరియాను ఎలా కట్టడి చేయనున్నారనే విషయాన్ని అమెరికా ఇంకా వెల్లడించలేదు. ఈ వారం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమెరికా హెచ్చరికలను తోసిపుచ్చుతూ.. గత నెలలో క్షిపణి పరీక్షలు చేపట్టింది ఉత్తర కొరియా. రెండు కొత్తతరం గైడెడ్‌ మిసైల్స్​ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

ఇదీ చూడండి:'క్షిపణి ప్రయోగాలపై ఐక్యరాజ్య సమితి ద్వంద్వ నీతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.