ETV Bharat / international

'అణు' చర్చలకు అమెరికా-ఇరాన్ సమాయత్తం - అమెరికా, ఇరాన్​ చర్చలు

అణు ఒప్పందంపై తిరిగి చర్చించేందుకు అమెరికా, ఇరాన్ సమాయత్తమయ్యాయి. మంగళవారం మధ్యవర్తుల ద్వారా చర్చలను ప్రారంభిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్​ ప్రైస్​ తెలిపారు.

US, Iran say they will begin indirect talks on nuclear programme
అణు ఒప్పందంలో పురోగతి- అమెరికా, ఇరాన్ పరోక్ష చర్చలు
author img

By

Published : Apr 3, 2021, 7:18 AM IST

ఇరాన్ అణు ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ దిశగా వచ్చేవారం మధ్యవర్తుల ద్వారా చర్చలను ప్రారంభిస్తామని అమెరికా, ఇరాన్ శుక్రవారం తెలిపాయి. దీంతో ఈ ఒప్పందంలోకి రెండు దేశాలనూ తిరిగి తెచ్చే దిశగా గణనీయ పురోగతి సాధించినట్లయింది. 2015లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాలకు కట్టిడి చేస్తే.. అమెరికా, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో అమెరికాతో పాటు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్​, జర్మనీ, రష్యాలు భాగస్వాములుగా ఉన్నాయి.

వైదొలిగిన అమెరికా

దాదాపు మూడేళ్ల కిందట నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, తిరిగి ఇరాన్​పై ఆంక్షలు విధించారు. దీనికి ప్రతిగా ఇరాన్​ తన అణు శుద్ధి కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. జనవరిలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన జో బైడెన్​.. ఈ ఒప్పందంలోకి తిరిగి ప్రవేశించటం తనకు ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. అయితే తొలుత ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ షరతు పెట్టింది. దీనిపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి వియన్నాలో పరోక్ష చర్చలు ప్రారంభం కానున్నాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్​ ప్రైస్​ చెప్పారు.

ఇదీ చదవండి : ఆ పోలీసు గౌరవార్థం అమెరికా జెండా అవనతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.