ETV Bharat / international

ట్రంప్​కు మరోమారు అభిశంసన చిక్కులు! - గ్రీన్

నలుగురు మహిళా డెమొక్రాట్ ప్రతినిధులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ అమెరికా దిగువ సభ తీర్మానం చేసింది. ట్రంప్​ పార్టీకి చెందిన నలుగురు ప్రతినిధులు మద్దతు తెలపగా... ఈ తీర్మానం 240-184 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అనంతరం ట్రంప్​పై అభిశంసన తీర్మానం ప్రతిపాదించారు టెక్సాస్ ప్రతినిధి గ్రీన్​.

మరోమారు అభిశంసన చిక్కులు!
author img

By

Published : Jul 17, 2019, 3:09 PM IST

Updated : Jul 17, 2019, 4:53 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. నలుగురు డెమొక్రాట్​ మహిళా ప్రతినిధులను ఉద్దేశించి చేసిన ట్వీట్లపై పెను దుమారం రేగింది. ట్రంప్​ జాత్యహంకార వైఖరికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ అమెరిగా దిగువ సభలో డెమొక్రాట్లు తీర్మానం ప్రవేశపెట్టారు. 240-184 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. ట్రంప్​ రిపబ్లిక్​ పార్టీకి చెందిన నలుగురు ప్రతినిధులూ మద్దతు తెలపడం విశేషం.

అమెరికాను ద్వేషించే వారు, ఇష్టపడని వారు దేశం వీడి వెళ్లాలని నలుగురు మహిళా డెమొక్రాట్​ ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఆదివారం ట్వీట్ చేశారు ట్రంప్​.

ఈ వ్యాఖ్యలను డెమొక్రాట్లు తీవ్రంగా తప్పుబట్టారు. జాతి వివక్షకు నిదర్శమని విమర్శించారు. అమెరికాలో వలసదారులకూ స్వేచ్ఛ, భద్రత ఉంటాయని తీర్మానం ప్రవేశపెట్టిన డెమొక్రాట్ ప్రతినిధి స్పష్టం చేశారు.

ట్రంప్​పై అభిశంసన తీర్మానం?

అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు టెక్సాస్​ ప్రతినిధి అల్​ గ్రీన్​​. ట్రంప్​ను పదవి నుంచి తొలిగించేందుకు వారంలోగా ఓటింగ్ నిర్వహించే అవకాశముంది.

సభ నిబంధనల ప్రకారం ఒక్క సభ్యుడైనా అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. రిపబ్లికన్లు మెజారిటీ ఉన్న సభలో గ్రీన్ ఇప్పటికే రెండుసార్లు అభిశంసన తీర్మానం పవేశపెట్టి విఫలమయ్యారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ట్రంప్​పై అభిశంసన తీర్మానానికి మెజారిటీ డెమొక్రాట్లు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా... అధికారిక ప్రక్రియ ప్రారంభించేందుకు స్పీకర్​ నాన్సీ పెలొసి సిద్ధంగా లేరు.

ఇదీ చూడండి: వీసాల జారీలో భారతీయులకు మరింత లబ్ధి!

Bengaluru, July 17 (ANI): While addressing the mediapersons on Supreme Court's (SC) verdict in Karnataka rebel MLAs case, Bharatiya Janata Party (BJP) veteran leader and former Karnataka chief minister BS Yeddyurappa said, "Karnataka CM has lost his mandate, when there is no majority he must resign tomorrow. I welcome SC's decision, it's the victory of constitution and democracy, a moral victory for rebel MLAs. It's only an interim order and SC will decide powers of Speaker in future."
Last Updated : Jul 17, 2019, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.