సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌పై అమెరికా ప్రభుత్వం సహా 48 రాష్ట్రాలు, జిల్లాలు అవిశ్వాస వ్యాజ్యం దాఖలు చేశాయి. చిన్న సంస్థలను అణిచివేసేందుకు సామాజిక మాధ్యమాల్లో మార్కెట్ అధికారాన్ని దుర్వినియోగం చేసిందంటూ ఫేస్‌బుక్‌పై ఆరోపణలు గుప్పించాయి. ఈ మేరకు ఫేస్‌బుక్‌పై అవిశ్వాస వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఫెడరల్ ట్రేడ్ కమిషన్, న్యూయార్క్ అటార్నీ జనరల్ ప్రకటించారు.
ఫేస్‌బుక్ అనుబంధ సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌పై ఆ సంస్థ హక్కులు వదులుకోవాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. సంస్థలను ఆక్రమించుకోవడాన్ని ఆపి మార్కెట్‌లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ సూచించారు.
ఇదీ చూడండి: 43 శాతం పెరిగిన ఫేస్‌బుక్ ఇండియా ఆదాయం