అమెరికా ఫ్లోరిడాలో 'మైఖేల్ పెనుతుపాను' బీభత్సం సృష్టించింది. ఈ పెనుతుపాను ధాటికి ఉడ్విల్లేలో 8 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మిసిసిపీలో ముగ్గురు, అలబామాలో ఓ మహిళ మరణించారు. ఇళ్లు, భవనాలు, వృక్షాలు కూలి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తీవ్ర నష్టం కలిగించిన ఈ తుపాను కేటగిరీ-5కు చెందినదిగా జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం తెలిపింది.
మైఖేల్ హరికేన్ మెక్సికో తీరం నుంచి గంటకు 145 కి.మీ వేగంతో ఫ్లోరిడా దిశగా పయనించింది. తరువాత విజృంభించి గంటకు 252 కి.మీ వేగంతో ఫ్లోరిడా వద్ద తీరం దాటిందని నేషనల్ హరికేన్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.
1992 ఆండ్రూ పెనుతుపాను తర్వాత మళ్లీ ఇదే అంత తీవ్రమైన తుపాను. రికార్డుల పరంగా నాల్గవది కూడా.
ఇదీ చూడండి: స్పైస్జెట్లోకి 500 మంది జెట్ ఉద్యోగులు