ETV Bharat / international

గుడ్ న్యూస్: కరోనా వ్యాక్సిన్ తయారీ ఫేజ్​-1 సక్సెస్!

కరోనా వ్యాక్సిన్​ తొలి విడత క్లినికల్ ట్రయల్స్​లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు అమెరికాకు చెందిన ఓ డ్రగ్ తయారీ సంస్థ తెలిపింది. ఎనిమిది మంది వలంటీర్లలో రోగనిరోధక ప్రతిస్పందనలను వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినట్లు స్పష్టం చేసింది.

US firm Moderna
కరోనా వ్యాక్సిన్ మొడెర్నా
author img

By

Published : May 18, 2020, 7:08 PM IST

కరోనా వ్యాక్సిన్ తయారీలో కీలక ముందడుగు పడింది. తొలి విడతలో భాగంగా కొంతమంది వలంటీర్లపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్​లో 'సానుకూల మధ్యంతర' ఫలితాలు వచ్చినట్లు అమెరికన్ డ్రగ్ తయారీ సంస్థ మోడెర్నా వెల్లడించింది.

క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన ఎనిమిది మంది శరీరాల్లో రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగేలా వ్యాక్సిన్ ప్రభావం చూపించిందని మోడెర్నా తెలిపింది. వైరస్​ సోకిన వ్యక్తుల్లో కనిపించే స్థాయిలో ఈ ఇమ్యూన్ ఉత్పత్తి జరిగినట్లు స్పష్టం చేసింది.

జూలైలో నిర్వహించే మూడో దశ క్లినికల్ ట్రయల్స్​లో పెద్ద సంఖ్యలో వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగం చేయనున్నట్లు స్పష్టం చేసింది మోడెర్నా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.