ETV Bharat / international

తిమింగలం మింగినా.. ప్రాణాలతో బయటపడ్డాడు!

అమెరికాలో ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తిమింగలం మింగినా.. ఓ వ్యక్తి ప్రాణాలతో బయపడ్డాడు. తాను ఇంకా బతికి ఉన్నానంటే నమ్మబుద్ధి కావడం లేదని తెలిపాడు.

US Diver Swallowed By Humpback Whale, Survives After Mammal Spits Him Out after 30 Seconds
తిమింగలం మింగినా ప్రాణాలతో బయటపడ్డ డైవర్​
author img

By

Published : Jun 13, 2021, 1:49 PM IST

కొన్ని సంఘటనల గురించి వింటే ఇలా కూడా జరుగుతాయా? ఆని ఆశ్చర్యమేస్తుంది. అమెరికా మసాచుసెట్స్​లోని ప్రావిన్స్​ టౌన్​కు చెందిన ఓ సీనియర్​ డైవర్ వ్యవహారం కూడా ఇంతే! తిమింగలం మింగినా కూడా ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ విషయాన్ని ఆయనే నమ్మలేకపోతున్నారు. తాను మళ్లీ భార్యా బిడ్డలను చూస్తానని ఊహించలేదని చెప్పాడు.

గాల్లో ఎగిరిపడి..

కేప్​ కాడ్​ సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 11 ఉదయం 8 గంటలకు మైకేల్ ప్యాకర్డ్ అనే 56ఏళ్ల డైవర్​.. మరో వ్యక్తితో కలిసి ఓడలో సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 60 డిగ్రీలు, నీటి దృశ్యమానత 20 అడుగులుగా ఉంది. ఎప్పటిలానే సముద్రంలోకి డైవ్​ చేసిన మైకేల్​కు చేపలు గుంపులుగా కన్పించాయి. ఇంతలోనే తనను ఏదో బలంగా తోస్తున్నట్లు అనిపించింది. క్షణాల్లోనే మొత్తం అంధకారమైంది.

అప్పుడే తనపై ఓ తిమింగలం దాడి చేసిందని అనుమానం వచ్చినట్లు మైకేల్​ తెలిపాడు. కానీ దాని దంతాలు తాకినట్లు గానీ, నొప్పిగా ఉన్నట్లు గానీ అనిపించేలేదని పేర్కొన్నాడు. చివరికి.. తాను తిమింగలం నోట్లో ఉన్నానని, అది తనను మింగేందుకు ప్రయత్నిస్తోందని అర్థమైనట్లు ఆ నాటి భయానక పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. తన భార్యా బిడ్డలను ఇక చూడబోనని, ఆసమయంలో అనుకున్నట్లు చెప్పాడు. 30సెకన్ల పాటు తిమింగలం నోట్లేనే ఉన్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత తిమింగలం నీటిపైకి వచ్చి ఉమ్మేయడం వల్ల తాను గాల్లో ఎగిరి నీటిలో పడినట్లు మైకేల్ చెప్పాడు.

చివరికి.. ఓడలో వెళ్లిన మరో వ్యక్తి మైకేల్​ను కాపాడాడు. మైకేల్ గాల్లోకి ఎగిరి నీటిలో పడటాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.

ఈ ఘటనలో కాళ్లు విరిగి ఆసుపత్రిలో చేరిన మైకేల్​.. కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం కర్ర సాయంతో నడుస్తున్నాడు.

ఇదీ చూడండి:- కరోనాపై కసితో 365 రోజులుగా సరస్సులో ఈత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.