ETV Bharat / international

అణు పరీక్షల వైపు ట్రంప్ అడుగులు.. చైనా కోసమేనా!

అగ్రరాజ్యం మళ్లీ అణు పరీక్షలు నిర్వహించనుందా? అంటే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక అవునంటోంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ వార్తనూ రాసింది. రక్షణ విభాగంలోని ప్రస్తుత సీనియర్ అధికారి.. ఇటీవల ఇద్దరు మాజీ అధికారులతో అణు పరీక్షలపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా, చైనాకు చెక్​ పెట్టేందుకు ట్రంప్​ సర్కార్​ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

US-NUCLEAR TEST-REPORT
అణు పరీక్షల కోసం ట్రంప్ ప్రయత్నాలు
author img

By

Published : May 23, 2020, 8:56 PM IST

Updated : May 24, 2020, 12:17 PM IST

అణు పరీక్షల నిర్వహణకు సంబంధించి దశాబ్దాల తర్వాత అమెరికా తొలిసారి చర్చించింది. రష్యా, చైనాకు సరైన హెచ్చరిక పంపించేందుకు 1992 తర్వాత అణు పరీక్షల చేసేందుకు సిద్ధమౌతోందట! ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం సమాలోచనలు జరిపిందని వాషింగ్టన్​ పోస్ట్ నివేదించింది.

పోస్ట్ కథనం ప్రకారం..

అమెరికాకు చెందిన ఇద్దరు మాజీ అధికారులతో సీనియర్​ అధికారి మే 15న భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే అణు పరీక్షల నిర్వహణపై చర్చించినట్లు తెలుస్తోంది.

అమెరికా రక్షణ విభాగం నుంచి ఇటువంటి విధానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదే కొనసాగితే అణ్వాయుధాల పోటీకి మళ్లీ ఆజ్యం పోసినట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఒప్పందం కోసమేనా..!

ఈ మధ్య కాలంలో రష్యా, చైనా సైతం ఎక్కువ స్థాయిలో అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ఆధారాలేవీ చూపించలేదు. అయితే ఈ ఆరోపణలను రష్యా, చైనా కొట్టిపారేశాయి. ఆ రెండు దేశాలు అణు పరీక్షల విషయంలో వెనక్కితగ్గట్లేదని భావించిన ట్రంప్​.. తామూ పరీక్షలు చేద్దామని చర్చించడం చర్చనీయాంశమైంది.

అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి చైనా, రష్యాతో త్రైపాక్షిక ఒప్పందం కోరాలని భావిస్తోంది అగ్రరాజ్యం. ఇందుకోసం ర్యాపిడ్​ టెస్టులను నిర్వహించి.. చర్చలకు తెరలేపే వ్యూహాన్ని అమలు చేసే సామర్థ్యం అమెరికాకు ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఆ ఉపాయాన్ని ఎన్​పీటీ కార్యకర్తలు తిరస్కరిస్తున్నారు. ఈ విషయంలో ఈ మూడు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Last Updated : May 24, 2020, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.